News
News
X

AP Education System : భవిష్యత్ లో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తారు, నాడు-నేడుపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ప్రశంసలు

AP Education System : ఏపీ విద్యా విధానంపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ ప్రశంసలు కురిపించారు. జెనీవా ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ పేరిట ఏపీ స్టాల్ ఏర్పాటుచేశారు.

FOLLOW US: 
Share:

AP Education System :  స్విట్జర్లాండ్ లోని జెనివా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో  గురువారం ఎడ్యుకేషన్ ఫర్ ప్యూచర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... కరోనా కారణంగా చాలా దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. అయితే ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఏపీలో పేద విద్యార్థుల కోసం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కితాబు ఇచ్చారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని ప్రశంసించారు.  ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్థాయిలో ఉన్నాయన్నారు.  విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని, ఇది గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా రాణిస్తారని ఆకాంక్షించారు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరివల్లా సాధ్యం కాదన్నారు. 

ఏపీ విద్యా విధానంపై ప్రశంసలు 

ఎడ్యుకేషన్‌ ఫర్‌ ప్యూచర్‌ పేరిట ఏపీ ప్రభుత్వ పథకాల స్టాల్‌ ను జెనివాలో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ పలువురు సందర్శించారు. ఏపీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అడిగితెలుసుకున్నారు. స్వయంగా స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు కురిపించారు.  స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిసియా దన్టీ ఏపీ స్టాల్ ను సందర్శించారు. ఏపీ ప్రభుత్వ పథకాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్‌ విధానంలో నాడు-నేడు కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరు, విద్యా ప్రమాణాలను అడిగితెలుసుకున్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ట్యాబ్‌లు అందించడం,  పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్‌ బోర్డుల ఏర్పాటు  విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. 

అందరికీ సమాన విద్య 

 విద్యా వ్యవస్థలో ఇలాంటి సౌకర్యాలు ఉంటే సమాజంలో అన్నివర్గాల వారు విద్యనభ్యసిస్తారని స్విట్జర్లాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పాట్రిసియా దన్గీ  అన్నారు.  విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించడం మంచి పరిణామం అన్నారు. లైబ్రరీ, ఆటస్థలం, శుభ్రమైన బాత్రూమ్స్‌, టాయిలెట్స్‌, యూనిఫాం, స్టేషనరీ కిట్స్‌, పుస్తకాలు అందిస్తున్న విధానం చాలా బాగుందని కితాబు అచ్చారు. అందరికీ సమానవిద్య విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్‌ యూనిసెఫ్‌ ప్రోగ్రామ్స్‌ స్పెషలిస్ట్‌ అతెనా లౌబాచెర్‌ కూడా విజిట్ చేశారు. ఏపీ ఎడ్యుకేషన్‌ విధానంతో అసమానతలు రూపుమాపవచ్చన్నారు. డిజిటల్‌ ఎడ్యుకేషన్ లో భాగంగా బైజూస్‌ ద్వారా ట్యాబ్ లు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.   

సుస్థిర అభివృద్ధికి విద్య చాలా కీలకం 

సుస్థిర అభివృద్ధికి మంచి విద్య, శిక్షణ చాలా కీలకమని ఐక్యరాజ్యసమితి విశ్వసిస్తోంది. కరోనా ప్రభావం విద్యావ్యవస్థపై పడిన సమయంలో ఏపీ ప్రభుత్వం ఉత్తమ విద్యా వ్యవస్థలను ప్రోత్సహిస్తోంది.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతుంది.  గ్లోబల్ లీడర్‌లు, దేశాధినేతలు, UN సభ్య దేశాలు హాజరయ్యే హై లెవెల్ పొలిటికల్ ఫోరమ్ -SDG సమ్మిట్‌లో నవరత్నాలు పథకాల స్టాల్ ఏర్పాటుచేశారు.   

Published at : 25 Feb 2023 07:23 PM (IST) Tags: AP News Nadu Nedu AP Education Switzerland CM Jagan Education System

సంబంధిత కథనాలు

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!