అన్వేషించండి

AP New CS: ఏపీ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి, డిసెంబర్ 1 నుంచి బాధ్యతల స్వీకరణ?

AP New CS: రాష్ట్ర ప్రభుత్వ నూతన కార్యదర్శిగా కె.ఎస్. జవహార్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచే ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం. 

AP New CS: పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ భాారీగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగాా ముఖ్యమైన సీఎస్ నియామకంపై సీఎం ఫోకస్ పెట్టారు. 

ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న సమీర్‌ శర్మ మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేశారు. ఆయన ప్లేస్‌ ఎవర్ని తీసుకురావాలన్న డిస్కషన్‌ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. వచ్చేది ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఈ పదవికి చాలా మంది ఐఏఎస్‌లు పోటీలో ఉన్నారు.  

ఎంత మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం సీఎంకి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఆయన నియామక జీవో రిలీజ్ అయ్యే ఛాన్స్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నియామకం ఫైనల్ అయిందని... డిసెంబర్‌ 1న ప్రమాణం కూడా చేయబోతున్నారని టాక్.   

ఒకవేళ జవహర్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైతే... ఆయన 2024 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. అంటే ఏడాదిన్నర పాటు సేవలు అందిస్తారు. కరెక్ట్‌గా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత రిటైర్ అవుతారు. అందుకే ఆయన నియామకానికి సీఎం మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. 

సీఎస్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్‌ రెడ్డిపై ఎప్పటి నుంచే జగన్‌కు ప్రత్యేక ఇంట్రస్ట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఆయన ఇప్పటి వరకు వివిధ జిల్లాల కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా సేవలు అందించారు. ఇప్పుడు సీఎంకు స్పెషల్‌ సెక్రెటరీగా ఉన్నారు. 

. సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ జగన్ మాత్రం జవహర్‌నే సీఎస్‌గా నియమించబోతున్నట్టు తెలుస్తోంది. 1987వ బ్యాచ్ నీరభ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్ కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ కు చెందిన కరికాల్ వలెవన్ సీఎస్ రేస్‌లోకి వచ్చారు. కానీ వివిధ కాారణాలతో వారిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. 

సీఎస్ గా పదవీ విరమణ అనంతరం సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్ లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ ఛైర్మన్ పోస్టులోనూ ఆయనను ఇంఛార్జీగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప జగన్ ప్రభుత్వ హయాంలో పని చేసిన సీఎస్‌లందరూ రిటైర్‌మెంట్‌ తర్వాత ఏదో ఒక పదవిలో నియమితులయ్యారు. 

ఇప్పటి వరకు నలుగురు ఐఏఎస్‌లు సీఎస్‌లుగా పని చేశారు. మొదట ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత నీలంసహ్నీ, అదిత్యనాథ్‌ దాస్‌, ఇప్పుడు సమీర్ శర్మ. అందరు కూడా సీఎంకు అత్యంత సన్నిహింతగా మెలిగారు. ఎల్వీ సుబ్రహ్మణానికి డిమాష్‌ వస్తే మిగతావాళ్లకు మాత్రం రిటైర్‌ అయిన తర్వాత వేర్వేరు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. నీలం సాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గానూ, ఆదిత్య నాథ్ దాస్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు.

అలానే ఇప్పుడు రిటైర్ కాబోతున్న సమీర్ శర్మకు కూడాా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం. ఆయన 2021 అక్టోబర్ 10వ తేదీన సీఎస్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన 2021 నవంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ రెండు సార్లు పొడగించారు. మొదట ఆరు నెలల పాటు పొడగించారు.  రెండోసారి మరో ఆరు నెలలు పొడగించారు. అంటే ఏడాది పాటు ఆయన పొడిగింపును పొందారు. ఈ మధ్యకాలంలో సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ రివ్యూ మీటింగ్‌లోనే మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. ఆయన గుండెకు ఆరేషన్‌ కూడా జరిగింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Singapore: భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Telugu Student Dies In US: అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
Embed widget