అన్వేషించండి

Chandrababu : బీసీల పొట్టగొట్టి జగన్ పొట్ట పెంచారు, పేరుకే పదవులు పెత్తనం అగ్రకులాలదే - చంద్రబాబు

Chandrababu : వైసీపీలో పెత్తనమంతా ఒక్క జిల్లా వ్యక్తులదే అని చంద్రబాబు విమర్శించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏంచేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు.

Chandrababu : వైసీపీలో పేరుకే బీసీలకు కొన్ని పదవులు పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు.  రాష్ట్రంలో బీసీలకు ఇదేం ఖర్మ అనే పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలపై బీసీ సంఘాలు ప్రతి ఇంటా చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. బీసీల పొట్టగొట్టిన సీఎం జగన్‌ తన పొట్ట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మాయమాటలు చెప్పి బీసీలను నట్టేట ముంచారని విమర్శించారు. విద్వేషంతో బీసీలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 

టీటీడీలో మూడు పదవులే

వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప బీసీలకు అదనంగా ఏంచేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీ కులాలకు సీఎం జగన్ ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో 16 పదవులు బీసీలకు ఇవ్వాల్సి ఉంటే కేవలం మూడు పదవులే బీసీలకు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు వివిధ నామినేటెడ్ పోస్టులు, యూనివర్సిటిల్లో ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువగా ఉందన్నారు.  సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో సీఎం జగన్ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 సీన్ రిపీట్ అవుతుందని చంద్రబాబు అన్నారు.  

మీటింగ్ కు రాకపోతే సంక్షేమ పథకాలు తొలగింపు 

 రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ ప్రాధాన్యత తగ్గించారని చంద్రబాబు ఆరోపించారు. బీసీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. అందుకే ఆదరణ పథకం గత ప్రభుత్వంలో అమలు చేశామని గుర్తుచేశారు.  టీడీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు.  సీఎం, డీజీపీ, సీఎస్, సకల శాఖామంత్రి అంతా ఆయన జిల్లాకు చెందినవారే ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల వీళ్లే రాజకీయం చేయగలరా? బీసీలు రాజకీయం చేయలేరా? యూనివర్శిటీల్లో వీసీలు, రిజిస్ట్రార్లను అందరూ వాళ్లే ఉన్నారని, ఇతర కులాల వీసీలను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి, ఆ యూనివర్శిటీతో ఏం సంబంధం లేని రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారన్నారు. జగన్ మీటింగ్‌కు రాకపోతే సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. మీటింగ్ లకు వచ్చిన ఆడపిల్లల చున్నీలను లాగేస్తున్నారని మండిపడ్డారు.  పెళ్లి కానుక, అన్న క్యాంటీన్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తొలగించారన్నారు. సీఎం జగన్ బటన్ నొక్కడం మాత్రమే వచ్చని ఎద్దేవా చేశారు. ప్రజల పొట్టలు కొట్టి, జగన్ తన పొట్ట పెంచుకుంటున్నారని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. 

సాయంత్రానికి సంచుల్లో డబ్బులు 

వైసీపీ ప్రభుత్వంపై ఏ వర్గం బాగుపడలేదని చంద్రబాబు అన్నారు. గిరిజనులకు ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. ఇటీవల వరదల్లో ప్రభుత్వం గిరిజనులను ఏ విధంగా చూసిందో అందరికీ తెలుసన్నారు. సీఎం జగన్ మీటింగ్‌కు వచ్చిన వారు వెళ్లిపోకుండా పోలీసులను కాపలా పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం తాగి 29 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసన్నారు. ఆయనే మద్యం ఫ్యాక్టరీ, ఆయనే మద్యం వ్యాపారి, ఆయన మనుషులే వర్కర్లు సాయంత్రం అయితే సంచుల్లో డబ్బులు లెక్కపెట్టుకోవడమే వారి పని అని చంద్రబాబు ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget