Pawan Kalyan: జనసేనాని తగ్గేదేలే- వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం
Janasena Chief Pawan Kalyan: వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై విరణ ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. అయినా జనసేనాని వెనక్కి తగ్గలేదు.
Janasena Chief Pawan Kalyan About V volunteers: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న వారాహి విజయయాత్ర రెండో విడత ప్రారంభం కాగా, ఏలూరులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో కీలకమైన వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర నేరారోపణలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది యువతులు, మహిళలు మిస్సయ్యారని, వారిలో 18 వేల మంది ఆచూకీ తేలియటం లేదన్న పవన్.. వీరి మిస్సింగ్ కు వాలంటీర్లకు సంబంధం ఉందని ఆరోపించారు. ఒంటరి యువతులు, బాలికలు, మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులు ఇస్తున్నారని, దీనిపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే చెప్పాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై విరణ ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. అయినా జనసేనాని వెనక్కి తగ్గలేదు. సోమవారం సైతం వాలంటీర్ వ్యవస్థపై కామెంట్స్ చేశారు.
నేడు జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఏలూరు కార్యకర్తలు, వీర మహిళలు సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీకు 5 లక్షల వాలంటీర్లు ఉన్నారు అంటున్నారు. వారి డేటా ఎస్పీ ఆఫీసు, కలెక్టరు ఆఫీసులో ఉండాలి అన్నారు. వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అన్నారు. కేవలం 5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హత లో 4 యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు అని ప్రశ్నల వర్షం కురిపించారు.
#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
— JanaSena Party (@JanaSenaParty) July 10, 2023
వాలంటీర్లు పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న @YSRCParty ప్రభుత్వం.
• 5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు?
• 4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు?
•… pic.twitter.com/gfwNy9NxEf
4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు?. ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, వాలంటీర్లతో ప్రజల డేటా సేకరిస్తుంది జగన్ ప్రభుత్వం అని ఆరోపించారు. వాలంటీర్లతో ప్రభుత్వం డేటా సేకరించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది ఎవరు అన్నారు. వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు, వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అని అభిప్రాయపడ్డారు. వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేశారా లేదా?, మీ ప్రాంతంలో ప్రజలను మీతో భయపెట్టిస్తున్నరా లేదా. ఆలోచించండి గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలలో వృద్ది లేకుండా చేస్తున్నాడు సీఎం జగన్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
ఓడిపోయినా జనసేన వాళ్లు ఇంత కమిటెడ్ గా ఉన్నారు అని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మనం బలంగా ఉన్నామంటే, తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. వైసీపీకి బైబై, జగన్ కు బైబై చెప్పాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని.. జగన్ మంచి నేత అయితే తనకన్నా ఎక్కువ సంతోషించే వాడు ఉండడన్నారు. కానీ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, త్వరలోనే వైసీపీకి చరమగీతం పలుకుదామని ఓటర్లకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Also Read: Pawan Kalyan: సీఎం జగన్ ను పవన్ ఏకవచనంతో సంబోధించటం వెనుక కారణం ఇదేనా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial