అన్వేషించండి

YS Jagan: ఎన్నికలకు ముందు పాదయాత్ర - యువనేతల సమావేశంలో జగన్ ప్రకటన

YSRCP: ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. యువనేతలకు ఇప్పుడే గొప్ప అవకాశం వచ్చిందన్నారు.

YSRCP Jagan Padayatra: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని అంతకు ముందే జిల్లాలలో పర్యటిస్తానన్నారు.  జగన్ తాను రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ రాజీపడలేదని, భవిష్యత్తులో కూడా రాజీపడనని ప్రకటించారు. అధికారంలో లేనప్పటికీ, ప్రజల కోసం నిలబడి పోరాడుతూనే ఉంటానని  వైపీపీ యూత్ వింగ్ సమావేశంలో ప్రకటించారు.                                    

 యూత్ వింగ్ సభ్యులను సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన విధానాలను, అవినీతిని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.  కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు తగిన భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అక్రమ కేసులతో YSRCP నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు .                

జగన్ కూటమి ప్రభుత్వంపై విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద రూ. 6,400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, దీనివల్ల విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని విమర్శించారు.   కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, దీనివల్ల ఒక సంవత్సరంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని జగన్ పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహాన్ని YSRCP బలంగా మార్చుకోవాలని, దీనికి యూత్ వింగ్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి, వారి పక్షాన పోరాడాలని   యూత్ వింగ్ సభ్యులను జగన్ కోరారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించడం ద్వారా 2029 ఎన్నికల్లో YSRCP రికార్డు మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.                    

యువ నాయకులకు ఇప్పుడే మంచి అవకాశం అన్నారు. ప్రభుత్వానికి భయపడకుండా ఉద్యమం చేస్తే.. వారిని పైకి తీసుకు వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. పెరగాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని.. ఎదిగేలా తాను చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. యూత్ వింగ్ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి యువ నేతల్ని ఆహ్వానించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి రాజా అందర్నీ కోఆర్డినేట్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Skipped Vijay Tour: తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
తమిళనాడు సీఎం పర్యటనలో కనిపించని డిప్యూటీ సీఎం - పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం జరిగారు?
Tirumala Water Scarcity: తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
తిరుమలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. అడుగంటుతున్న డ్యామ్‌లు.. 90 రోజులకు మాత్రమే నీటి నిల్వలు!
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Embed widget