ABV To AP Govt : రూల్స్ దాటకుండా ప్రెస్‌మీట్ - షోకాజ్ నోటీస్‌కు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ రిప్లయ్ !
ప్రెస్మీట్ పెట్టడంతో తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని పరిశీలించి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
పెగాసస్ ( Pegasus ) అంశంపై ప్రెస్ మీట్ పెట్టడం సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ( Sameer Sarma ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ( ABV ) సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడా ఆలిండియా సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించిందన్నారు. తనకు ఇచ్చిన నోటీసులో ఉన్న రూల్ నెంబర్ 17 ప్రకారంమే తాను మీడియాతో మాట్లాడినట్లు ఏబీ వెంకటేశ్వరరావు తన సమాధానంలో తెలిపారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో జగన్ భేటీ, ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన
ప్రెస్‌మీట్‌లో తాను ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని ఆ లేఖలో వివరించారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
సైకిల్ ఎక్కేది బాబు, తొక్కేది పవన్ - ఈయన వ్యూహాలన్నీ టీడీపీ వైపే: అంబటి రాంబాబు
తన గౌరవానికి భంగం కలిగించేలా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని, విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్‌ను కూడా వివరణలో పేర్కొన్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
సామాజిక సమీకరణాలు కలిసొచ్చిన వారే మినిస్టర్స్ ! అదృష్టవంతులు వీళ్లేనా ?
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ( YSRCP ) వచ్చినప్పటి నుండి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేదు. దాదాపుగా రెండున్నరేళ్ల నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనపై మీడియాతో మాట్లాడారారని చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసు ఇవ్వడంతో కలకలం రేగింది. దానికి ఏబీవీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనన్న ఆసక్తి ఉన్నతాధికార వర్గాల్లో ఏర్పడింది.