అన్వేషించండి

AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ఏపీలో ఓటర్ల జాబితా అంశంపై రఘురామకు ఈసీ సమాచారం పంపింది. దాదాపుగా 27 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలిపింది.

AP Voters List : ఏపీలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని  కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదుపై విచారణ జరిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్ పై 2,51,767 ఓట్లు, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై 1,57,939 ఇళ్ళలో 24,61,676 దొంగ ఓట్లు నమోదైనట్టు గుర్తించామని సమాచారం పంపింది.  వీటిలో ఇప్పటి వరకు జీరో హౌస్ నెంబర్ పై నమోదైన 61,374 దొంగ ఓట్లను, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై నమోదైన ఇళ్ళ నుండి 21,347 ఇళ్ళను తొలగించామని సమాధానం పంపింది.  మిగిలిన వాటిపై చర్యలు తీసుకుని అర్హత లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని, ఇకపై ఇటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వివరాలతో  చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం ఎంపీ రఘురామకు నివేదికను పంపింది.
AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ఏపీలో ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా దుమారం రేగుతోంది.  రాష్ట్రంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని  చంద్రబాబు కోరారు.  అధికార వైసీపీ దొంగ ఓట్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.   

ప్రజాస్వామ్యంలో ఓటర్లు ముఖ్యం.  దేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు  హక్కు ఉంటుంది. కానీ ముందుగా జాబితాలో ఉండాలి. అలా జాబితాలో లేకుండా ఎవరికైనా ఓటు నిరాకరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఓటర్ల జాబితా అంశంలో సీరియస్ గానే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా జోలికి అధికార పార్టీలు కూడా వెళ్లవు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈసీ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను తీసుకుని తాము సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాయి  రాష్ట్ర ఎన్నికల సంఘాలు. అప్పుడు కొన్ని ఓట్లు గల్లంతవుతాయన్న  ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాల్సిన వారి జాబితా మ్యానిపుల్టే అయిపోయిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 
AP Voters List : ఏపీలో 27 లక్షలకుపైగా అనుమానాస్పద ఓట్లు - ఎంపీ రఘురామకు ఎన్నికల సంఘం రిప్లయ్ !

ప్రతీ నియోజకవర్గంలో ఐదు నుంచి పది వేల ఓట్లు  ప్రత్యర్థి పార్ట సానుభూతి పరులవి తప్పిస్తే ఫలితం తారుమారవుతుంది. కానీ ప్రజాస్వామ్యం తలకిందులవుతుంది. ఇప్పుడు ఏపీలో ఏదే చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఈసీకి చేసిన ఫిర్యాదులో ఓట్ల తొలగింపు కోసం అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారని వెల్లడించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి,  మంత్రి సీదిరి అప్పలరాజు నేరుగానే మన పార్టీ ఓట్లు కాకపోతే అబ్జెక్షన్ చెప్పాలని క్యాడర్ ను ఆదేశించారు. అంటే అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే  ఓట్లను తొలగించే ప్రయత్నం  చేస్తున్నారని ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget