Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఉక్కపోత
Telangana Weather Updates: ఏపీ, తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో భారీగా మార్పులు జరుగుతాయి. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 చేరగా.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా ఉండటంతో, ఉక్కపోత పెరిగిపోతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలు ప్రభావం అధికం. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వెదర్ అప్‌డేట్‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీలు, బాపట్లలో 18.8 డిగ్రీలు, నందిగామలో 19.4 డిగ్రీలు, అమరావతిలో 19.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేడెక్కతున్న రాయలసీమ..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇకనుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు చలికి గజగజ వణికిన ఆరోగ్యవరంలో 26.5 డిగ్రీల మేర అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడి ఎక్కువ కావడంతో ఉక్కపోతగా ఉంటుంది. అనంతపురంలో 18.3 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీలు, తిరుపతిలో 20.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.
View this post on Instagram
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. భద్రాచలంలో అత్యధికంగా 36.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 34.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 32.2 డిగ్రీలు, హకీంపేటలో 31.2 డిగ్రీలు, హన్మకొండలో 32 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 35.4 డిగ్రీలు, నిజామాబాద్‌లో 34.9 డిగ్రీలు, రామగుండంలో 33.2 మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Also Read: Gold-Silver Price: శుభవార్త! క్రమంగా దిగొస్తున్న పసిడి ధర, నేడు ఎంత ఉందంటే
Also Read: Tirumala: తిరుమలలో పెరుగుతున్న రద్దీ, రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు