అన్వేషించండి

Andhra Pradesh Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సంచలనం - ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ - జగన్‌కు చిక్కులు?

liquor case Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అరెస్టు చేసింది. ఉదయం ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Dhanunjay Reddy and Krishnamohan Reddy Arrested :  ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ అధికారులరు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సీఐడీ సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఉదయం వీరిద్దరికీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వారికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ఇప్పటికే బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. వీరిద్దరికీ మాత్రం ఇప్పటి వరకూ రిలీఫ్ ఉంది. 

మూడో రోజు విచారణకు హాజరైన సమయంలో సుప్రీంకోర్టు షాక్ - అరెస్టు ఖాయమని అప్పుడే సంకేతాలు            

 రెండు రోజుల నుంచి విచారణకు హాజరు అవుతున్నారు. ప్రస్తుతం బెయిల్ ఇస్తే.. విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే.. దిగువ కోర్టులు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.  రెండు రోజుల నుంచి వీరిద్దరూ విచారణకు హాజరవుతున్నారు ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. వారిని విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోవడంతో అరెస్టు కావడం ఖాయమని వారికి అర్థమయింది.    ఈకేసులో ఈడీ కూడా ఎ 1 నిందితుడు అయిన రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది. కోర్టు అనుమతి ఇచ్చింది.        

మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు                   

ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ధనుంజయ్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు సీఎంవోను ఒంటి చేత్తో నడిపించారు.  కృష్ణమోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు. వీరిద్దరూ తమ కుటుంబసభ్యుల పేర్లతో కంపెనీలు పెట్టి మద్యం సొమ్మును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఏపీ సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బుల తరలింపులో వీరిది కీలక  పాత్ర అని చెబుతున్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుంటే.. చెప్పే  వివరాలు మాజీ సీఎం జగన్ కు ఇబ్బందికరంగా  మారుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.    

విజయసాయిరెడ్డి వాంగ్మూలమే కీలకం !

గతంలో విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంపై జరిగిన సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యారని మీడియా ముందు చెప్పారు. సీఐడీ అధికారులకు కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.   ధనుంజయ్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి. వైసీపీ  ఓడిపోయే  ముందు రోజునే ఆయన పదవి కాలం పూర్తి అయింది. ఐఏఎస్ గా చేసి మద్యం స్కాంలో జైలుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  వీరి అరెస్టులో విజయసాయిరెడ్డి వాంగ్మూలం కీలకంగా మారినట్లుగా భావిస్తున్నారు.                                

టాప్ హెడ్ లైన్స్

Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget