అన్వేషించండి

Polavaram : మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించండి- పోలవరంపై కేంద్రం మరో షరతు

Polavaram : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో నిబంధన పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Polavaram : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో షరతు పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే(Economic Survey)ను మరోసారి నిర్వహించాలని ఏపీని కోరింది. లోక్‌సభ(Loksabha)లో వైసీపీ ఎంపీలు(Ysrcp MPs) బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ(Central JalSakti) సహాయ మంత్రి బిస్వేస్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌(DPR) తయారు చేయాలన్న నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. పోలవరం నిర్మాణంలో  రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14,336 కోట్లు ఖర్చు చేసిందని కేంద్రం పేర్కొంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి రూ.12,311 కోట్లు తిరిగి చెల్లించామని కేంద్రం తెలిపింది. తాజాగా రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జల్‌శక్తి శాఖ వివరించింది. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జల్ శక్తి శాఖ రాష్ట్రాన్ని కోరింది. 

2023 నాటికి ప్రాజెక్టు పూర్తి 

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తిపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో పురోగతితో పాటు పునరావాస, పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్‌ 2022-23 కోసం నీటి పారుదల రంగానికి గానూ రూ.11,482 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు.  

ఇటీవల పోలవరంలో కేంద్ర మంత్రి పర్యటన 

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ( Gajendra Singh Shekavat) ఇటీవల పోలవరంలో( Polavaram ) పర్యటించారు. ఇందుకూరు- 1, తాడ్వాయిల్లో  పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలను కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించారు. పునరావాస కాలనీలు అద్భుతంగా ఉన్నాయని మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు ( CM Jagan ) కృతజ్ఞతలని తెలిపారు.  పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానికే అని కేంద్ర మంత్రి ఇటీవల ఏపీ పర్యటనలో తెలిపారు. తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది. రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని తెలిపింది. దీంతో పోలవరం నిర్మాణం నిర్దేశిత సమయం కన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Embed widget