MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
MP Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ కు ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ లేఖ రాశారు. ఈ వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో తెలిపారు.
MP Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ కు ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ లేఖ రాశారు. ప్రధానితో పాటు లోక్‌సభ స్పీకర్, జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు ఎంపీ గిల్ లేఖ రాశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని, ఎంపీలకు మాయని మచ్చలా ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని ఎద్దేవా చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ పంపి నిజానిజాలు తేలుస్తున్నామని వైసీపీ ఎంపీ భరత్ తనతో అన్నారని ఎంపీ గిల్ తెలిపారు. గోరంట్ల వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎంపీ జస్బీర్ సింగ్ గిస్ తన లేఖలో తెలిపారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చాలని ఆయన కోరారు.
గోరంట్ల వ్యవహారంపై రఘురామ
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి స్పందించారు. ఈ వ్యవహారంపై ఎస్పీ ఫక్కీరప్ప నిన్న వివరణ ఇస్తూ ఒరిజినల్ వీడియో లభిస్తే గానీ ఎవరి వీడియో తేల్చలేమన్నారని తెలిపారు. వీడియోను వీడియో తీయడం వల్లే నిర్ధారించలేకపోతున్నామని, దీనిని లండన్ నుంచి అప్లోడ్ చేశారన్నారని రఘురామ తెలిపారు. వైసీపీ ఎంపీలు ఈ వీడియోను ఫోరెన్సిక్ కు పంపారన్నారు. కానీ నిన్న ఫక్కీరప్ప ఫోరెన్సిక్ కు పంపలేదని, ఒరిజినల్ ఉంటే ఫోరెన్సిక్ పంపిస్తామని చెప్పారన్నారు. ఒక ఫొటోను ఫొటో తీస్తే అందులోని వ్యక్తి అతడు కాకుండా పోతాడా అని రఘురామ ప్రశ్నించారు.
కులచిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు
"ఎస్పీ ఫక్కీరప్ప మంచి వ్యక్తి అని విన్నాను. నెల్లూరులో మంత్రి కాకాణి కేసు విషయంలో కోర్టులో పత్రాలను కుక్కలు చింపేశాయని అప్పట్లో అన్నారు. ఈ మధ్య ఎస్పీలు వివిధ కేసుల్లో మంచి లాజిక్స్ చెబుతున్నారు. గోరంట్ల వ్యవహారంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్పీ అన్నారు. ఫిర్యాదు చేయకుండా ఫోన్ తీసుకుని చెక్ చేయలేమన్నారు. అయితే అప్పట్లో రఘురామకృష్ణరాజు ఫోను తీసుకున్నారని, ఆయనను అరెస్టు చేశారన్న విషయాన్ని ఎస్పీకి విలేఖరులు గుర్తుచేస్తే, లేదు లేదు అలా చేయలేదని మాట దాటేశారు. గోరంట్ల మాధవ్ నిజంగా నిందితుడు అయితే అతనిపై చర్యలు తీసుకోండి. లేదంటే నిందితులు ఎవరో పట్టుకోండి. ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. వ్యక్తిగత అంశాన్ని కులాల మధ్య చిచ్చు పట్టేలా మాట్లాడుతున్నారు." - ఎంపీ రఘురామ
వీడియోపై ఎస్పీ ఏమన్నారంటే?
సంచలనం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంలో అనంతపురం జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో స్పష్టంగా చెప్పలేమని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు జరిపామని అది ఒరిజినల్ వీడియో కాదని గుర్తించామన్నారు. ఒకరు వీడియో చూస్తూంటే.. మరొకరు ఆ వీడియోను ఫోన్‌లో చిత్రీకరించారన్నారు. ఆ తర్వాత ఆ వీడియోను అనేక సార్లుగా ఫార్వార్డ్ చేయడం వల్ల అది ఒరిజినలో కాదో గుర్తించలేకపోతున్నామన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని ఎస్పీ ఫక్కీరప్ప అనుమానం వ్యక్తం చేశారు.
టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో
ఒరిజినల్ వీడియో ఇంత వరకూ లభించలేదన్నారు. ఒరిజినల్ వీడియో సోర్స్ ఉంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగలమన్నారు. పైగా ఈ వీడియో వ్యవహారంపై బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. మొదట ఈ వీడియో ఆగస్టు నాలుగో తేదీన తెల్లవారుజామున రెండు గంటలకు ఐ టీడీపీ అఫీషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయిందన్నారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ గ్రూప్‌లో యాడ్ చేసిన యూకే నెంబర్ ద్వారా ఆ వీడియో పోస్ట్ చేశారు. అది విదేశాలకు చెందిన నెంబర్ కనుక.. ఆ వ్యక్తి ఎవరో కనుగొనేందుకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు. వీడియోలో ఉన్నది ఎవరన్నది కూడా చెప్పలేమని ఎస్పీ తేల్చేశారు. ఎంపీ మాధవ్ ఇంత వరకూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.
Also Read : నేను పార్టీ మారడంలేదు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
Also Read : YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం