అన్వేషించండి

Amaravati Captial Petition : అమరావతిపై ఏపీ సర్కార్ పిటిషన్, 161 మంది ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Amaravati Captial Petition : రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ చేపట్టిన కోర్టు ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు మొత్తం 161 మందికి సుప్రీం నోటీసులు జారీచేసింది.

Amaravati Captial Petition : అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది. ఏపీ ప్రభుత్వం రాజధానిపై లేవనెత్తిన అంశాలపై కోర్టు ప్రతివాదులైన రాజధాని రైతులు, వివిధ పార్టీలకు నోటీసులు జారీచేసింది. జనవరి 31 లోపు అఫిడవిట్ దాఖలు చేయమని ప్రతివాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజధాని రైతులు, వివిధ పార్టీల నేతలు మొత్తం 161 మంది ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీచేసింది. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును పిటిషన్ దాఖలు చేసింది. అమరావతిలో నిర్మాణాల కాలపరిమితిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

హైకోర్టు తీర్పుపై స్టే 

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోనేగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని.. నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని గత విచారణలో సుప్రీం ధర్మానసం ప్రశ్నించింది. అయితే అసలు మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న మూడు నుంచి ఏడు అంశాలు  పూర్తిగా అమరావతి అభివృద్ధికి కాలపరిమితి నిర్దేశించి ఇచ్చినవని, వాటిపై జనవరి 31వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది.

గత విచారణలో వాదనలు

సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని పిటిషన్లపై గత విచారణలో చురుగ్గా వాదనలు సాగాయి.  కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్.. ఏపీ హైకోర్టు ఇచ్చిన రిట్ ఆఫ్ మాండమస్‌పై స్టే ఇవ్వాలని కోరారు. రాజధానిని నిర్ణయించుకునే చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి చెప్పడం సరికాదన్నారు. అయితే  రైతులతో చేసుకున్న ఒప్పందం గురించి ఏం చెబుతారని జస్టిస్ జోసెఫ్ ప్రస్తావించారు. అయితే  అమరావతిగా రాజధానిని తరలించడం లేదని.. అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఉంటుందని..రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం ఇప్పటికీ అమరావతినే రాజధానిగా ఉందన్నారు. రాజధాని విషయంలో చట్టం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. ఓ దశలో మరో సీనియర్ న్యాయవాది నారిమన్.. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. అయితే జస్టిస్ జోసెఫ్ దీనిపై స్పందిస్తూ రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల అధికారమని..   ఒక చోటపెట్టాలి .. అభివృద్ధి చేయాలని తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు. రైతుల తరపున సీనియర్ లాయర్ సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. 29 వేల మందిరైతులు తమ బతుకు దెరువు అయిన భూమిని రాజధానికి ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం వల్ల రాష్ట్రానికే కాదని వారికి కూడా లాభం ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని, 2019 నుంచి ఎలాంటి నిర్మాణాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ధర్మాసనానికి చూపించారు.  


 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Embed widget