అన్వేషించండి

TDP News : చంద్రబాబుతో భేటీ కానున్న దాడి వీరభద్రరావు - టీడీపీలో చేరే అంశంపై చర్చ !

Daadi Veerabhadra Rao : వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరికపై చర్చించే అవకాశం ఉంది.

Daadi  Veerabhadra Rao into TDP : వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బుధవారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు.  విశాఖ జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు .. టీడీపీని వీడిన తర్వాత  వెనుకబడిపోయారు.  వైసీపీలో చేరిన ఆయనకు పెద్దగా అవకాశాలు లభించలేదు.  ఇప్పుడు కూడా వైసీపీలో గుర్తింపు లభించే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేశారు. బుధవారం చంద్రబాబును కలవనున్నారు.   టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయన 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయనను కలిసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది.                             

 వైసీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికి వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశం పార్టీలో చేరదామనుకున్నా ఆయనకు స్థానిక రాజకీయాలు దారి ఇవ్వలేదు.  దాంతో సైలెంట్ గా ఉండిపోయారు.  మధ్యలో పవన్ కల్యాణ్ కూడా దాడి వీరభద్రరావుతో ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యారు కానీ.. జనసేనలో చేరలేదు. తర్వాత మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏదో ఓ నమినేటెడ్ పోస్టు అయినా ఇస్తారేమో అనుకున్నారు. కానీ దాడి కుటుంబాన్ని సీఎం జగన్ అసలు గుర్తించలేదు. ఏ పోస్టూ ఇవ్వలేదు. పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. దీంతో దాడి కుటుంబం చాలా కాలంగా రాజకీయంగా కార్యకలాపాలేమీ లేకుండానే ఉంది.                            

కీలకమైన గవర సామాజికవర్గంలో పట్టు ఉన్న నేతగా దాడి వీరభద్రరావుకుపేరు ఉంది.కానీ చేసిన తప్పటడుగుల  వల్ల.. ఆయనతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరినా  ఆయనకు టిక్కెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆయన చేరిక కోసం టీడీపీలోని కొంత మంది ఉత్తరాంధ్ర నేతలు  చంద్రబాబు వద్ద రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది. అన్నీ  కలసి వస్తే పోటీ అంశం చూద్దామని..  ముందుగా పార్టీలో చేరడానికి ఏ అభ్యంతరం లేకుండా చూసుకున్నారని ఉన్నారు.            

అదే సమయంలో మరో ఉత్తరాంద్ర నేత  కొణతాల రామకృష్ణ కూడా  యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వీరిద్దరే అనకాపల్లిలో ప్రత్యర్థులుగా ఉండేవారు. టీడీపీ తరపున దాడి, వైసీపీ తరపున కొణతాల పోటీ పడేవారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మారిపోవడం.. మారిన రాజకీయాలకు తగ్గట్లుగా ఈ నేతలు అడుగు వేయకపోవడంతో వెనుకబడ్డారు.                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?అల్లు అర్జున్ అరెస్ట్, FIR కాపీలో ఏముంది?అల్లు అర్జున్‌ కేసు FIRలో అసలేముంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Embed widget