Coronavirus Cases Today: ఏపీలో కొత్తగా 1,608 కరోనా కేసులు.. ఆ మూడు జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు, అదొక్కటే స్వల్ప ఊరట
ఏపీలో కరోనా ప్రభావం కొన్ని జిల్లాల్లో అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా నమోదు కాగా, కొవిడ్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో కరోనా సెకండ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా మరణాలు తాజాగా కాస్త దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,608 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 6 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,24,755 పాజిటివ్ కేసులకు గాను 19,95,666 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,119 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో ఇప్పటివరకూ 13,970 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. మరోవైపు యాక్టివ్ కేసులు 15 వేలకు చేరుకున్నాయి. రాష్ట్రంలోనూ ప్రమాదకర ఏవై 12 కేసులు నమోదవుతున్నాయని అధికారులు ప్రజలను హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో 1,107 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...
#COVIDUpdates: 10/09/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) September 10, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,24,755 పాజిటివ్ కేసు లకు గాను
*19,95,666 మంది డిశ్చార్జ్ కాగా
*13,970 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0fRLcmUfH1
కొవిడ్ బారిన పడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు.. ప్రకాశం జిల్లాలో ఇద్దరు చనిపోగా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 72 లక్షల 29 వేల 781 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281, ఆ తరువాత నెల్లూరు జిల్లాలో 261 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 18, శ్రీకాకుళం జిల్లాలో 21 మంది కరోనా బారిన పడ్డారు.
Also Read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
ఏపీలో నమూనా పరీక్షల సంఖ్య : 67,911
కోవిడ్19 పాజిటివ్ కేసులు: 1,608
తాజా మరణాలు : 6
అత్యధిక కేసులు: చిత్తూరు జిల్లాలో 281, నెల్లూరు జిల్లాలో 261 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 213
కరోనా యాక్టివ్ కేసులు : 15,119
గడిచిన 24 గంటల్లో రికవరీల సంఖ్య : 1,107
Also Read: దేవుడు కాపాడాలనుకుంటే.. ఇలాగే జరుగుతుందట.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..