అన్వేషించండి

 CM Jagan Review: పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి.. లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆ పని చేయాలి  

స్కూళ్లల్లో కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలన్నారు.

 

ఏపీలో ఇటీవల స్కూళ్లు తెరుచుకోగా, పాఠశాలలో కొవిడ్19 నిబంధనలు తప్పకుండా పాటించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు కనిపించిన వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. అర్హులైన వారందరూ టీకాలు తప్పకుండా వేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా వారికి సూచనలు ఇవ్వాలన్నారు.


వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పారు. పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని,150 మందికే అనుమతి ఉంటుందని తెలిపారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని జగన్‌ ఆదేశించారు. 
ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు రాకూడదన్నారు.

Also Read: AP Vs Odissa : అస్సాం - మిజోరం ఘర్షణ తరహా పరిస్థితులు ఏపీ - ఒరిస్సా మధ్య ఏర్పడతాయా..? కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది..?

'కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇస్తూ వెళ్లాలి. పాఠశాలల్లో సమర్థంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి. వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా దృష్టిసారించాలి. మాస్క్‌లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులను వేగంగా చేపట్టాలి.' అని సీఎం జగన్ చెప్పారు.

Also Read: Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

వెబ్‌సైట్‌ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులపైనా కూడా నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా?లేదా? అన్నదానిపై నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డ్రగ్‌స్టోర్లను కచ్చితంగా తనిఖీలు చేయాలన్నారు. మందులు నాణ్యతతో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం అన్నారు.
 
ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం చెప్పారు. క్రమం తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చూసే అవకాశాన్ని చూడాలన్నారు. డ్రగ్‌ డీలర్లు పంపిణీ చేస్తున్న మందులకు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 


పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్‌పైనా సీఎం సమీక్షించారు. న్యూమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్‌  కాంజ్యుగట్‌ వ్యాక్సిన్‌ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు అధికారులు  తెలిపారు. పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. 

Also Read: AP Corona Updates: ఏపీలో తాజాగా 909 కరోనా కేసులు.. కొత్తగా ఎంతమంది వైరస్ నుంచి కోలుకున్నారంటే..

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget