By: ABP Desam | Updated at : 03 Feb 2023 06:26 PM (IST)
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
YS Viveka Murder case CBI: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో ఆరున్నర గంటల పాటు ఇద్దర్ని ప్రశ్నించారు. విచారణకు సీఎం జగన్ ఓఎస్డీగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, అలాగే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో పని చేసే నవీన్ అనే వ్యక్తి హాజరు అయ్యారు. ముందుగా కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. నవీన్ విచారణకు వచ్చినట్లుగా స్పష్టత లేదు కానీ.. ఆయన సెంట్రల్ జైలుకు వచ్చారని..ఆయనను కూడా రహస్యంగా సీబీఐ ప్రశ్నించిందని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో భారీ భద్రత నడుమ విచారణ జరుగింది. కృష్ణమోహన్ రెడ్డితో పాటు కడప సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి, యాదాటి సునీల్, ఉమా శంకర్ రెడ్డి లను సిబిఐ విచారించే అవకాశం ఉంది.
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు.. ఎంపీ అవినాష్ రెడ్డి కాలే డేటాను సీబీఐ పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను బట్టి నవీన్ , కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులను సీబీఐ జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఫోన్లను నవీన్ అటెండ్ చేస్తూంటారని చెబుతున్నారు. గతం నుంచి జగన్ వద్ద పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎస్డీగా నియమించారు. వీరిద్దరిని ఆరు గంటల పాటు ప్రశ్నించడంతో తర్వాత సీబీఐ ఎలాంటి అడుగు వేయబోతోందోనన్న ఆసక్తి ప్రారంభమయింది.
వివేకా హత్య కేసు విచారణను ఇప్పటికే హైదరాబాద్ కోర్టుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసు అధికారికంగా సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ సీబీఐ కోర్టు ప్రారంభించింది. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జ్ షీట్ విచారణకు స్వీకరించింది. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబరు కేటాయించింది. హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డికి ఈ సమన్లు వెళ్లాయి. వీరిలో నలుగురు జైల్లో ఉండగా.. ఒక్క ఎర్ర గంగిరెడ్డి మాత్రం బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది.
అలాగే నిందితుల్ని కూడా కడప జైలు నుంచి హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు చేసిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరికి కడప జైల్లో ముప్పు పొంచి ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా కోర్టుకు చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు నిందితుల్ని హైదరాబాద్ లోని చంచల్ గూడ లేదా చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద
Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?