అన్వేషించండి

CM Jagan : అమెరికాలో పైలట్ శిక్షణకు సాయం - పాలకొల్లు యువతికి సీఎం జగన్ వరం !

అస్ట్రోనాట్ శిక్షణ పొందుతున్న జాహ్నవి దంగేటికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం జగన్ అంగీకరించారు.

CM Jagan :   ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..  గ్రామీణ   పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్థిక భరోసా అందించారు.  పాలకొల్లుకు చెదిన జాహ్నవి దంగేటి  అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణక ఎంపికయ్యారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు అవసరం అయిన ఆర్థిక సాయం చేయాలన్న విజ్ఞప్తులు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయి. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన.. జాహ్నవి దంగేటికి  భరోసా ఇచ్చారు. పోలవరం బాధితుల పరామర్శల కోసం ఏలూరు వచ్చిన సీఎం జగన్‌ను జాహ్నవి దంగేటి కలిశారు.  అమెరికాలో శిక్షణ  నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. జాహ్నవి విజ్ఞప్తికి ముఖ్యమంత్రికి  సానుకూలంగా స్పందించిన సీఎం ట్రైనింగ్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

ఇప్పటికే జాహ్నవి ఏవియేషన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ ట్రైనింగ్ కు కూడా ఏపీ ప్రభుత్వమే సాయం చేసింది. ఏవియేషన్ పైలట్ కావడం తన లక్ష్యమని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో..  జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు రూ. 50 లక్షల సాయం అందజేసిన ఏపీ ప్రభుత్వం.నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు జాహ్నవి దంగేటి. 

 2021 నవంబరులో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు జాహ్నవి ఎంపికయ్యారు.  అంతరిక్షానికి సంబంధించిన ప్రాథమిక అవగాహనపై శిక్షణ పొందారు. తర్వాత పోలండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్‌కు ఎంపికై, విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు.  మూన్ సిమ్యులేటర్‌పై శిక్షణ పొందారు.  2021 నవంబర్‌ 12న అమెరికాకు వెళ్లి నాసాకు చెందిన స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సైన్స్‌ సెంటర్‌లో ఆస్ట్రోనాట్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.  పది రోజుల్లో జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, అండర్‌ వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ చేయడంతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకున్నారు.                                                

జాహ్నవి అస్ట్రోనాట్ గా  చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి ఇండియన్ అని అనిపించుకోవడమే  లక్ష్యంగా  పని చేస్తున్నారు. జాహ్నవి సాధించిన విజయాలు .. భారత యువతలో అంతరిక్ష రంగంలో మరింత ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.                           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Embed widget