అన్వేషించండి

CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు

Andhra News: విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు చిన్నారులు ముందుకొచ్చారు. తమ పాకెట్ మనీని సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు వారిపై ప్రశంసలు కురిపించారు.

School Children Donates Pocket Money For Flood Relief: విజయవాడలో (Vijayawada) వరద బీభత్సం సృష్టించి తీవ్ర విషాదం మిగిల్చిన క్రమంలో దాతలు స్పందించి తమకు తోచిన సాయం చేస్తున్నారు. కొందరు ఉచితంగా సర్వీసులు అందిస్తుంటే ఇంకొందరు డబ్బు రూపేణా తమకు తోచిన సాయం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, పలు సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. ఓ వ్యక్తి తన రోజు కూలీ డబ్బు రూ.600 సీఎంఆర్ఎఫ్‌కు అందజేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా, బాధితులకు అండగా 'మేము సైతం' అంటూ చిన్నారులు ముందుకొచ్చారు. తమకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని సీఎంఆర్ఎఫ్‌కు అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

వీడియో షేర్ చేసిన సీఎం

పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీని వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇతరులను గౌరవించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో మానవత్వాన్ని పెంచుతాయని.. చిన్నారులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

విరాళాల వెల్లువ

విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కు పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా, లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ.కోటి విరాళం అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. సోమవారం సీఎం చంద్రబాబును స్వయంగా కలిసిన ఆయన చెక్కును అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌ను సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ నిరంతరం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ ప్రశంసించారు.

ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన

మరోవైపు, ముంపు ప్రాంతాల్లో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. కబేళా సెంటర్‌లో బాధితులతో మాట్లాడారు. 9 రోజులుగా ప్రజలు పడిన బాధ వర్ణించలేమని.. వారి కష్టాలు తీర్చేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నామని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు బురద, నీటిలో తిరుగుతూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని.. ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారని మండిపడ్డారు. బెంగుళూరులో కూర్చొని తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని.. వారికి ఉపాధి మార్గాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

Also Read: VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
Embed widget