అన్వేషించండి

Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు

Bolla Brahma Naidu Land Scam Hyderabad: ప. గో జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘మీ భూమి – మీ హక్కు’ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత కబ్జాపై తీవ్ర విమర్శలు చేశారు.

 AP CM Warns Land Mafia:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం  ‘మీ భూమి – మీ హక్కు’ లో పాల్గొన్న ఆయన, రైతులకు సరికొత్త క్యూఆర్ కోడ్, బార్ కోడ్ లతో కూడిన పటిష్టమైన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన భూ రికార్డుల తారుమారును సరిదిద్ది, సరికొత్త బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భూములకు రక్షణ కల్పించే ఈ వేదికపై నుండి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై నిప్పులు చెరిగారు. 

1500 కోట్ల కబ్జాకోరును ఎందుకు సస్పెండ్ చేయలేదు? 

సిద్ధాంతం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్‌లో చేసిన రూ. 1500 కోట్ల భూ కబ్జా ఉదంతాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ తన ఆటలు సాగవనే భయంతో సదరు నేత తెలంగాణకు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్కడ గండిపేట పరిధిలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ జీవోలతో ఏకంగా రూ. 1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి రికార్డులు తారుమారు చేశారన్నారు. ఇంత పెద్ద దగాకు తెగబడిన నేతను ఆ పార్టీ అధ్యక్షుడు  ఎందుకు సస్పెండ్ చేయలేదు  అని చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు.

 గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై రైతుల ఫోటోలు తీసేసి, అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.  భూమి మీది, కష్టం మీది.. కానీ ఫోటో మాత్రం సైకోదా  పొలాల్లో కూడా రైతులను వదిలిపెట్టకుండా పీడించారు. ఇలాంటి పిచ్చి తుగ్లక్ చర్యలకు ట్రీట్‌మెంట్ ఎక్కడుందో చెప్పండి.. ఆ పార్టీ నేతలందరికీ అక్కడే వైద్యం ఇప్పిద్దాం  అంటూ బాబు వేసిన సెటైర్లకు సభలో నవ్వులు పూశాయి. దొంగతనాలు, నేరాలు చేయడంలో  గొడ్డలి పార్టీ  సిద్ధహస్తురాలని, తాము తప్పులు చేస్తూ నిందలు మాత్రం ఎదుటివారిపై వేయడం వారి నైజమని మండిపడ్డారు.

ప్రభుత్వ విద్యా విధానం, పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. అసలు పరీక్షలంటే ఏంటో తెలియని వాళ్ళు, విద్యా వ్యవస్థను ఎలా నడిపాలో కనీస అవగాహన లేని వాళ్ళు, రిజర్వేషన్ల ప్రాథమిక సూత్రాలు తెలియని అజ్ఞానులు ఈరోజు ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలను పెంచేందుకు తాము సంస్కరణలు తెస్తుంటే, తట్టుకోలేక విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. భూమాఫియా, అక్రమార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ రౌడీ, ఏ కబ్జాకోరు అయినా తోక తిప్పి ఎక్కువ చేస్తే.. వాడి తోక కత్తిరించి నడిబజారులో నిలబెడతాను  అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి ఆస్తికి, భూమికి పూర్తి రక్షణ ఉంటుందని, భూములను లాక్కునే సైకోల రాజ్యాంగానికి చరమగీతం పాడామని స్పష్టం చేశారు.   

 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూ రికార్డుల డిజిటలైజేషన్,  పారదర్శకత కోసం దేశంలోనే మొదటిసారిగా బ్లాక్‌చైన్ ఆధారిత ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థను తీసుకొచ్చామని చంద్రబాబు  ప్రకటించారు. ప్రతి భూమికి శాశ్వత డిజిటల్ ఐడీ ఇస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ రికార్డులను ట్యాంపర్ చేయలేరని వివరించారు. గత ప్రభుత్వ తప్పులన్నింటినీ కడిగేసి, నిజమైన రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ 'మీ భూమి - మీ హక్కు' ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నామని సిద్ధాంతం వేదికగా చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget