అన్వేషించండి

CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !

Swachh Andhra Pradesh 2026: గుడివాడ స్వర్ణాంధ్ర సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలుచేశారు. గత ఎన్నికల్లో చెత్త నోర్ల‌ను ఫినాయిల్ వేసి క్లీన్ చేశారని కొడాలి నాని ఉద్దేశించి సెటైర్లు వేశారు.

 Chandrababu Warning to Criminals:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన గుడివాడ వేదికగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు  అని సీఎం కరాఖండిగా హెచ్చరించారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనను గొడ్డలి పార్టీ రాజకీయంగా అభివర్ణించిన చంద్రబాబు, కొందరు నేతలు క్రిమినల్స్‌గా మారి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని, మాజీ మంత్రి కొడుకు చేసిన కారు ప్రమాదంలో ఒక ప్రాణం పోయినా అప్పటి ప్రభుత్వం స్పందించిన తీరే అందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన దోపిడీ, అరాచక రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. గత ఎన్నికల్లో కొంత మంది నేతల నోర్లను ఫినాయిల్ వేసి క్లీన్ చేశారని చంద్రబాబు కొడాలినానిని ఉద్దేశించి  పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తను ప్రజలే క్లీన్ చేశారు. ఆ నోర్లు ఏం నోరులో నాకు అర్థం కాలేదు. ఆ నోర్లన్నీ ఫినాయిల్‌తో శుభ్రం చేశారు. ఇంకా అక్కడక్కడ చెత్త వాసనలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుటుంబంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అడిగితే ఇది మా స్వేచ్ఛ అంటున్నారు  అని మండిపడ్డారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా గుడివాడ సభలో సీఎం చంద్రబాబు పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా  అమృత్ 2.0 AIUDF  అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో పాటు, పారిశుధ్య నిర్వహణలో అద్భుత ప్రతిభ కనబరిచిన స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు, కార్మికులకు స్వచ్ఛ అవార్డులు  అందజేశారు. ఈ సందర్భంగా కాలుష్యం మానవ ఆరోగ్యంపై చూపుతున్న ముప్పును ప్రస్తావిస్తూ, రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను చెత్త లేని రాష్ట్రం గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. ప్రతి కుటుంబం ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేస్తూ, తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చుకునే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రతిష్టాత్మక తల్లికి వందనం  పథకం సొమ్మును ఈ నెలలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కేవలం సాధారణ వర్గాలకే కాకుండా, సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగస్వాములైన కార్మికుల కుటుంబాలకు కూడా ఈ 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించి మహిళా లోకానికి పెద్ద భరోసానిచ్చారు. సంక్షేమం, సంస్కరణలు సమాంతరంగా నడుస్తాయనేందుకు తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు.

వ్యవసాయ, నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుంటే అనేకమంది అడ్డుపడ్డారని, కానీ తాము పట్టుబట్టి 12 నెలల్లోనే దానిని పూర్తి చేసి కృష్ణా డెల్టాను కరువవకుండా కాపాడామని చెప్పారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 450 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించిన రికార్డు తమదేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన  పోలవరం  ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డ భౌగోళిక వ్యూహకర్త చంద్రబాబు, ఇప్పుడు పనులను మళ్లీ వేగవంతం చేశామని, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును వంద శాతం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తమ అంతిమ లక్ష్యమన్నారు.  

ప్రస్తుతం గ్లోబల్ క్లైమేట్ చేంజ్, ఎల్‌నినో  ప్రభావం వల్ల వర్షాలు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, ఇటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికే తాము ముందుచూపుతో పర్యావరణ హిత ప్రకృతి సేద్యాన్ని   ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి పూర్తి సబ్సిడీలు, మద్దతు ఇచ్చి అండగా ఉంటామని, అలాగే పొగాకు పండించే రైతుల కష్టాలను కూడా తీరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Embed widget