Chandrababu custody : 50 ప్రశ్నలు - ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ కస్టడీ !
సీఐడీ అధికారులు చంద్రబాబును యాభై ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కూడా ప్రశ్నించనున్నారు.
Chandrababu custody : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అధికారులు కస్టడీలో తొలి రోజు ప్రశ్నించారు. ఈ ఉదయం 9.30 గంటల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో సాయంత్రం ఐదు గంటల వరకూ ఆయనను ప్రశ్నించారు. కోర్టు పెట్టిన షరతుల మేరకు విరామం ఇచ్చారు. అలాగే విచారణ మొత్తాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో మొత్తం చంద్రబాబును 120 ప్రశ్నలు అడగాలని ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలు్సతోంది. తొలి రోజు యాభై ప్రశ్నల వరకూ అడిగారని అంటున్నరు.
50 ప్రశ్నలకు సమాధానాలు
‘రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు..?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు?., అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది?, జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు..?. 13 చోట్ల నోట్ ఫైళ్లపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు..?, డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులను తరలించడం మీకు తెలు కోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబు చెప్పిన సమాధానాలు రికార్డు చేసి ధర్మాసనానికి సమర్పించాల్పి ఉంటుంది. ఆదివారం కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు.
వైద్య పరీక్షల తర్వాత విచారణ
సీఐడీ అధికారులు 9:30కి ముందే రాజమండ్రి సెంట్రల్ జైలులకు వెళ్లారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును వైద్య పరీక్షలకు తీసుకువెళ్లారు. సీఐడీ, జైలు అధికారుల సమక్షంలో చంద్రబాబు కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణను ప్రారంభించారు. విచారణకు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను అధికారులు అనుమతించారు. విచారణకు సంబంధించిన వీడియోలు బయటకు రాకూడదని.. ఫోటోలు .. వివరాలు బయటకు రాకూడదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని హైకోర్టు పేర్కొంది. ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు.