అన్వేషించండి

Chandrababu On YSRCP Plenary : ఏం సాధించారని ప్లీనరీ, సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

Chandrababu On YSRCP Plenary : సీఎం జగన్ ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాలు పేరిట నవ ఘోరాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu On YSRCP Plenary : వైసీపీ నవ రత్నాల పేరిట నవ ఘోరాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నగరిలో రోడ్‌ షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్‌ అందర్నీ వాడుకున్నారని విమర్శించారు. అమ్మను పార్టీ నుంచి సాగనంపారని ఆరోపించారు. పాదయాత్రలో తిరిగినట్లు సీఎం జగన్ ఇప్పుడు తిరగాలని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయన్నారు. జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. వైసీపీ పాలన పోవాలంటే ప్రజలు అండగా నిలబడాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు సవాల్ 

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏం సాధించారని వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తన  ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఏపీలో ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్‌ నింపుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి ఖజానాలు నింపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.  

చెత్త పన్ను ఘనత వైసీపీదే

టీడీపీ అధికారంలోకి వచ్చాక నగరిలో జౌళి పార్క్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారన్నారు. కాలువ తవ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతారా అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం టీడీపీ హయాంలో పూర్తిచేశామన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇష్టారీతిన పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget