అన్వేషించండి

Narayana Bail Cancelled : మాజీ మంత్రి నారాయణకు షాక్, బెయిల్ రద్దు చేసిన కోర్టు

Narayana Bail Cancelled : మాజీ మంత్రి నారాయణ బెయిల్ ను చిత్తూరు కోర్టు రద్దు చేసింది. నవంబర్ నెలాఖరులోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Narayana Bail Cancelled : మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు కోర్టు షాక్ ఇచ్చింది. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30వ తేదీ లోపు పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు తాజాగా బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పది ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మిగిలిన వారు నారాయణ స్కూల్ సిబ్బంది ఉన్నారు. 

నవంబర్ 30లోపు 

పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను చిత్తూరు పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.  

అసలేం జరిగింది? 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని హైస్కూల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న పదోతరగతి ఎగ్జామ్ పేపర్ లీకైంది. వాట్సాప్‌ ద్వారా తెలుగు పేపర్ లీక్ అవ్వడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నారాయణను అరెస్ట్‌ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే ఆయన వైదొలిగారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. అప్పట్లో కోర్టు నారాయణకు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఆ బెయిల్ ను పై కోర్టు రద్దు చేసింది. 

వాట్సాప్ లో పేపర్ 

పదో తరగతి పరీక్షల సమయంలో నారాయణ  విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడు పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామ్ మొదలైన గంట సేపు తరువాత నిందితుడు ప్రశ్నా పత్రాన్ని సెల్ ఫోన్ తో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో నారాయణ విద్యాసంస్థల   వ్యవస్థాపకులు నారాయణ, అలాగే కొంతమంది సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. 

చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో 

 ప్రతి ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల కోసం ప్రైవేటు యాజమాన్యాలు పోటీ పడుతుంటారు. ఎలాగైనా తమ కళాశాల విద్యార్థులు అధిక శాతం మార్కులు సాధించి నెంబర్ వన్ లో నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండేళ్ల తరువాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్డదారిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP DesamInd vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Hyderabad News: బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
బయటి ఫుడ్ తింటున్నారా? - చికెన్‌లో పురుగు, దోశలో బొద్దింక - ఇవి చూస్తే నిజంగా షాక్
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?
IND vs NZ 3rd Test Highlights: టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
టెస్టు చరిత్రలో టీమిండియా తొలి వైట్ వాష్! ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Vangalapudi Anitha: '3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
'3 నెలల్లోనే నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తాం' - తిరుపతి బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత
MP Vemireddy: ప్రభుత్వ అధికారి తప్పిదం - వేదిక మీద నుంచి అలిగి వెళ్లిపోయిన ఎంపీ వేమిరెడ్డి - మంత్రి, అధికారులు బతిమిలాడినా..
ప్రభుత్వ అధికారి తప్పిదం - వేదిక మీద నుంచి అలిగి వెళ్లిపోయిన ఎంపీ వేమిరెడ్డి - మంత్రి, అధికారులు బతిమిలాడినా..
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Embed widget