అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra Excise White Paper : సొంత బ్రాండ్లు తెచ్చి ఉన్మాదంగా మద్యం స్కాం - ఎక్సైజ్ వైట్ పేపర్‌‌లో కీలక విషయాలు వెల్లడించిన చంద్రబాబు

Andhra Pradesh : ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రాన్ని చంద్రబాబు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఉన్మాదంతో సొంత బ్రాండ్లను అమ్మి వేల కోట్ల స్కాం చేశారని ఆరోపించారు.

Andhra  White Paper of the Excise Department  : కొంతమంది అవసరాలకు తప్పులు చేస్తారు.. మరికొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు. కానీ గత ఐదేళ్లలో ఉన్మాదంతో తప్పు చేశారని జగన్ ఐదేళ్ల పాలన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీ శ్వేతపత్రాన్ని ఆయన ప్రకటించారు.  పాలకుడు, పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశారని స్పష్టం చేశారు.   నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమయం అవుతాయన్నారు.  నేరస్థుడే నాయకుడైతే ఎలా ఉంటుందో ఐదేళ్లలో చూశాం. ప్రభుత్వం విడుదల చేస్తోన్న ఏడు వైట్ పేపర్లను  పరిశీలిస్తే ఏపీకి ఐదేళ్లలో ఎంత అన్యాయం జరిగిందో  తెలుస్తుందన్నారు. 

మద్యం ధరలు పెంచి  పేదవాళ్లను నిలువుదోపిడీ చేసిన జగన్ 

మద్య నిషేధం అని వైసీపీ హామీ ఇచచి..   మధ్యం ధరలు విపరీతంగా పెంచారని చంద్రబాబు మండిపడ్డారు.   మద్యం ధరల పెరుగుదలపై ప్రశ్నిస్తే..ధరలు తగ్గిస్తే తాగేవారు తగ్గుతారని చెప్పారని గుర్తు చేశారు.  మొత్తంగా 75శాతం ధరలు పెంచారని  తెలంగాణ, తమిళనాడు, ఓడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని  ధరలను అసెంబ్లీలో ప్రదర్శించారు.  మద్యం వినియోగం పెరగడంతో పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగితే.. ఏపీలో మాత్రం తగ్గిందని గుర్తు చేశారు   ఆ ఆదాయమంతా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ధరలు పెంచి పేదల రక్తం పీల్చారని మండిపడ్డారు. 

ప్రసిద్ధ  బ్రాండ్ కంపెనీలకు వేధింపులు 

మద్యం సరఫరా చేసే పెద్ద కంపెనీలకు బకాయిలు చెల్లించకుండా .. ఆర్డర్లు ఇవ్వకుండా  తరిమేశారన్నారు  దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరక్కుండా చేశారన్నారు. వైసీపీ ఏ బ్రాండ్ అమ్మితే.. ఆ బ్రాండ్ మద్యాన్నే తాగాల్సిన పరిస్థితి  తెచ్చి  దోపిడీ చేశారన్నారు.  పగలంతా కష్టపడి.. సాయంత్రం కాస్త మద్యం తాగి అలసట తీర్చుకునే పేదవాడి జేబుకే చిల్లుపెట్టారని  వారి ఆరోగ్యాన్ని నాశనం చేశారన్నారు. పేదవాడికి అమ్మే లిక్కర్ రేట్లను పెంచి 99.9 శాతం ఆ బ్రాండే లేకుండా చేశారని ఆరోపించారు. 2019-24 మధ్య వైసీపీ నేతల కనుసన్నల్లో మద్యం సరఫరా జరిగిందని, టాప్ 5 బ్రాండ్స్ సేల్స్ గణనీయంగా తగ్గాయని తెలిపారు. లిక్కర్ పై వచ్చే ఆదాయమంతా వైసీపీ వాళ్ల జేబుల్లోకి వెళ్లడంతోనే.. ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని చంద్రబాబు లెక్కలు చూపించారు. 

రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు   

4380 షాపులను 2934కు తగ్గించినట్లే తగ్గించి.. వాటిని మళ్లీ 3392కు పెంచారని మొత్తం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించారన్నారు.   అమ్మకాల్లో రూ.99 వేల కోట్లు నగదు రూపంలోనే వచ్చిందని తెలిపారు.   . గత ప్రభుత్వం కల్తీ లిక్కర్ ను అమ్మి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని స్పష్టం చేశారు.   NCCB డేటా ప్రకారం.. 2018తో పోలిస్తే.. 2022లో ఆల్కహాల్, డ్రగ్స్ కు అడిక్టైన వారి సంఖ్య 100 శాతం పెరిగిందని సీఎం నివేదికల్ని అసెంబ్లీలో ప్రదర్శించారు.   2019-21 మధ్య భర్తల నుంచి ఎమోషనల్, ఫిజికల్, సెక్సువల్ వయోలెన్స్ ఎదుర్కొన్న మహిళల సంఖ్య 76.40 శాతానికి పెరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  2019తో పోలిస్తే.. 2023కి లివర్ వ్యాధిగ్రస్తులు 52 శాతం, కిడ్నీ వ్యాధి గ్రస్తులు 54 శాతానికి పెరిగాయన్నాు. ఒక్క  గుంటూరు జీజీహెచ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ లో ఉన్నవారి సంఖ్య 343 నుంచి 4,913కి చేరిందని దీనికి కారణం జగన్ అవినీతేనన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget