Chandrababu On Adani: ఒప్పందాల సమీక్షకు వెనుకాడం - ఏపీ తరపునా దర్యాప్తు - అదానీ వ్యవహారంపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
Andhra Pradesh: అదానీ విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణ చేయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో స్పందించారు.
Adani Jagan Issue: అమెరికాలో అదానీ గ్రూపు కంపెనీలపై నమోదైన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ లింకులు బయటపడటంతో సంచలveత్మకం అయింది. ఈ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. పెట్టుబడిదారుల విశ్వాసం చెక్కు చెదరకుండా ఈ అంశంలో జాగ్రత్తగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బ తీశారని మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందన్నారు. వీటిని పరిశీలించి, మరింత దర్యాప్తు చేయించి ప్రజల ముందు వస్తామని తెలిపారు చంద్రబాబు. ఏది చేయాలో చేస్తూనే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని అన్నారు. ఈ కేసు మీద ఆంధ్రప్రదేశ్‌లో కూడా విచారణ జరిపిస్తామని చంద్రబాబు తెలిపారు.
Also Read: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
తప్పు చేసింది ఏ ప్రభుత్వం అయినా...వ్యక్తి అయినా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసలు జరిగినవన్నీ వింటుంటే చాలా బాధ వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇంతలా దెబ్బ తీస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో, జగన్ రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు.
జగన్ అవినీతి పై అమెరికాలో వేసిన చార్జ్ షీట్ గురించి అందరూ చూశారు. ప్రభుత్వం దీనిపై తదుపరి అధ్యయనం చేసి, చర్యలు తీసుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే సహించేది ఉండదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో, జగన్ రెడ్డి నాశనం చేసాడు. ఇవన్నీ… pic.twitter.com/VlsRtYBHBR
— Telugu Desam Party (@JaiTDP) November 22, 2024
అయితే ఒప్పందాలను రద్దు చేయాలని వైసీపీ చంద్రబాబును సవాల్ చేసింది. తాను అదానీతో ఒప్పందాలు చేసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ దగ్గర ఒప్పందం చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరమన్నారు. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని పేర్ని నాని స్పష్టం చేశారు.
Also Read: షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేస్తే పెట్టుబడిదారులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చంద్రబాబు ఈ అంశంలో ప్రభుత్వం తరపున దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ దూకుడుగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. గత ఐదేళ్లలో పెట్టుబడిదారులు ఏపీ వైపు రావడానికి ఇబ్బంది పడ్డారని ఇప్పుడిప్పుడే ఆ సమస్యలను అధిగమిస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.