అన్వేషించండి

Andhra News : ఆ అధికారులకు మళ్లీ నిరాశే - కలిసేందుకు ఇష్టపడని చంద్రబాబు

Chandrababu : జగన్ హయాంలో వేధింపులకు పాల్పడిన అధికారులను చంద్రబాబు దూరం పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయంలో బోకేలతో సహా వచ్చిన వారిని కలిసేందుకు ఇష్టపడలేదు.

CM Chandrababu : ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది అధికారులకు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ చెప్పినట్లుగా చేసి టీడీపీ నేతల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడంతో పాటు చంద్రబాబుపైనా కుట్రలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కలిసేందుకు కూడా చంద్రబాబు అంగీరించడం లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆయనను అభనదించేందుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారిలో కొంత మందిని  భద్రతా సిబ్బంది వెనక్కి పంపేశారు. 

ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ర వంటి వారు బోకేలతో చంద్రరబాబు వద్దకు  వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి పేర్లకు ఆమోదం లేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. గతంలో టీడీపీ హయాంలో వీరు సిన్సియర్ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీరు.. టీడీపీకి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రల్లో భాగమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. రవణా శాఖ కమిషనర్ గా.. ఇంటలిజెన్స్ చీఫ్ గా సీతారామాంజనేయులు టీడీపీ నేతల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ కుటుంబ ట్రావెల్స్ వ్యాపారం ఆగిపోవడానికి.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకూ సీతారామాంజనేయులే కారణమని టీడీపీ నేతలు భావిస్తూ ఉంటారు. ఇక ఐజీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఎంతో మంది టీడీపీ నేతల్ని అరెస్టు చేశారు. ఒక్కరిపై కూడా ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చేయలేదు.               

అలాగే కొంత మంది ఐఏఎస్ అదికారులు కూడా పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కీలక బాధ్యలు నిర్వర్తించిన అజయ్ జైన్ అనే అధికారి.. వైసీపీ హయాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. తనను బెదిరించి ఇలాంటి స్టేట్ మెంట్ ఇప్పించారని తర్వాత ఆయన వివరణ ఇచ్చారని అంటున్నారు. అయితే బెదిరిస్తే.. ఏ తప్పు చేయని చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తారా అన్న ఆగ్రహంఆయనపై  చంద్రబాబులో ఉందని అంటున్నారు. ఇక మరో ఐపీఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ లభించలేదు.                           

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక నిందితురాలు అయిన ఆమె చాలా కాలం జైల్లో ఉన్నారు. తర్వాత తెలంగాణ క్యాడర్ లో పనిచేశారు. జగన్ గెలిచిన తర్వాత ఏపీకి వచ్చారు. జగన్ మరోసారి గెలిచి ఉంటే చీఫ్ సెక్రటరీ పోస్టు వస్తుందని ఆమె అనుకున్నారు.అందుకే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిణిగా ఆమె అనేక రకాల తప్పుడు జీవోలు జారీ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. రాజధాని రైతులకు కౌలు  కూడా రెండేళ్లుగా నిలిపివేశారని..కోర్టు ఉత్తర్వులు కూడా ధిక్కరించారని భావిస్తుంది. 

వీరితో పాటు నిబంధనలు ఉల్లంఘించిన  పలువురు అధికారులపై చర్యలు ఖాయమని.. టీడీపీ వర్గాలంటున్నాయి.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Embed widget