Chandrababu : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ - సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు !
చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయస్థానం తిరస్కరించింది. పూర్తి భద్రత ఉందన్న ఏఏజీ న్యాయవాదుల వాదనలతో జడ్జి ఏకీభవించారు.
Chandrababu : హౌస్ రిమాండ్ కు అనుమతించాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో పూర్తిభద్రత ఉంటుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించారు. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది.
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. హౌస్ రిమాండ్‌కు ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు విన్పించారు. సెక్షన్ 167(2) కింద రెండు కస్టడీలు మాత్రమే ఉంటాయని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ మాత్రమే ఉన్నాయంటున్న ఏఏజీ.. నవలఖా తీర్పును పరిగణనలోకి తీసుకోవాలంటూ లూథ్రా వాదనలు విన్పించగా... నవలఖా తీర్పునకు.. ఈ కేసుకు సంబంధం లేదన్నారు ఏఏజీ సుధాకర్‌రెడ్డి. అయితే కొన్నేళ్లు జైల్లో ఉండి ఆరోగ్యం క్షీణించిన వారికి మాత్రమే.. హౌస్ కస్టడీ ఇస్తారని వాదించారు. హౌస్ ప్రొటెక్షన్ అనేది సీఆర్‌పీసీలో ఎక్కడా లేదన్న ఏఏజీ.. చంద్రబాబుకు కావాల్సినంత భద్రత పెట్టామని.. ఆరోగ్యంగానూ ఉన్నారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రెస్ మీట్‌తో కొత్త చర్చకు తెరలేపిన బాలకృష్ణ - నేను వస్తున్నా అంటే మరి లోకేష్..?
అటు చంద్రబాబుపై ఉన్న నాలుగు కేసుల్లో ఆయన తరపున లాయర్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మూడు కేసుల్లో చంద్రబాబుపై ఆర్ఐఆర్ నమోదు అయింది. అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసు, పుంగనూరు అల్లర్లు, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏ1గా చంద్రబాబును చేర్చారు. విజయనగరంలో నమోదైన కేసుపైనా చంద్రబాబు తరపుణ బెయిల్ దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదైన నాలుగు కేసులపైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులన్నింటిపైనా హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
జైల్లో చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు, కానీ వారికి మాత్రం నిరాశే!
రాజమండ్రి జైల్లోని స్నేహ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుకు ఒక సహాయకుడు, ఐదుగురు జైలు భద్రత సిబ్బంది ఉంది. యోగా, వాకింగ్ అనంతరం జైలు గదిలోనే చంద్రబాబు ఉంటున్నారు. ఇక, చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని వ్యక్తిగత సహాయకుడు తీసుకెళ్తున్నాడు. సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ లోనారా లోకేష్ బస చేస్తున్నాడు. అయితే, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం 5.40 గంటలకు నిద్ర లేచినట్లు జైలు సిబ్బంది చెబుతున్నారు. మెడిటెషన్, యోగా చేసి.. అనంతరం న్యూస్ పేపర్ చదివి.. బ్లాక్ కాఫీ తాగినట్లు చెబుతున్నారు.