అన్వేషించండి

Chandrababu : రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ లేనట్లే - వైసీపీ నేతల చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

TDP : రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీలో ఉండటం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలో చేరుతామని వస్తున్న నేతలు అందర్నీ చేర్చుకోవడం లేదని పార్టీ నేతలకు తెలిపారు.

Chandrababu :  రాజ్యసభ ఎన్నికల్ోల టీడీపీ పోటీ పెడుతుందా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చింది. అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు తెలిపారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే  గట్టి పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.  టిక్కెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారని అనుకుంటున్నారు. అందుకే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారని అంటున్నారు. కానీ టీడీపీ పోటీ పెట్టకపోవడంతో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

చంద్రబాబుతో  పలువురు టీడీపీ నేతల భేటీ                                 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో  ఉండవల్లిలోని నివాసంలో పలువురు నేతలు సమావేశం అయ్యారు. రా కదలిరా, లోకేశ్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.   యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి తో పాటు ఆనం రామనారాయణరెడ్డి కూడా కలిశారు. ఇటీవలి కాలంలో పలువురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేందుకు వస్తున్నారని  ప్రచారం జుగుతోంది. దీనిపై నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని.. అయితే పార్టీలో చేర్చుకునే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చంద్రబాబు వారికి చెప్పరు.  వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేము .. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 

చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు అన్యాయం జరగదు  !                                  

పొత్తులు,  చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదన్నారు.  కష్టపడిన నేతల భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు,  ప్రకాశం జిల్లాల నుంచి ముగ్గురు ఎంపీలు.. పలువురు ఎమ్మెల్యేలు  పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పలువురు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారని.. ఫలానా సీట్లు ఖరారరయ్యాని చెబుతున్నారు. ఈ అంశాలపై మరికొంత మంది నేతలు పార్టీ అధినేతతో చర్చించేందుకు వస్తున్నారు. 

అందరూ ఎన్నికల మూడ్ లోకి రావాలని సూచన                                                

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున అందరూ .. ఎన్నికల మూడ్ లోకి రావాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఖరారైన పార్టీ అభ్యర్థులకు అనధికారిక సమాచారం ఇచ్చారు. వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొత్తుల వల్ల కొన్ని నియోజకవర్గాలపై స్పష్టత లేదు. వాటి విషయంలో మాత్రం సందిగ్ధత ఉంది. బీజేపీతో పొత్తుల చర్చలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ కారణంగానే పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యమవుతోందని అంచనా వేస్తున్నారు. మరో వారంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget