Chandrababu Bhuvaneshwari coffee chat : చంద్రబాబు, భువనేశ్వరి అరకు కాఫీ కబుర్లు - సోషల్ మీడియాలో వైరల్
Araku coffee ఛ అరకు కాఫీపై చంద్రబాబు, భువనేశ్వరి సోషల్ మీడియా చాట్ వైరల్ అవుతోంది. అసలు వీరి మధ్య ఎందుకు కాఫీ ప్రస్తావన వచ్చిందంటే ?
Chandrababu and Bhuvaneshwari social media chat over araku coffee is going viral : అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి అని టీడీపీ అధినేత చంద్రబాబు తన సతీమణిని ట్విట్టర్ ద్వారా అడిగారు. ఇలా చంద్రబాబు అడగడానికి కారణం అరకు కాఫీ షాప్ ముందు కూర్చుని భువనేశ్వరి కాఫీ తాగుతూ ఫోటో దిగారు. ఆ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు చంద్రబాబునాయుడు తన అధికారిక ఖాతా నుంచి.. కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి అని ప్రశ్నించారు.
Bhuvaneswari, how is the Araku Coffee produced by our tribal brothers and sisters? ( @ManagingTrustee ) pic.twitter.com/IdS6sb5Zwc
— N Chandrababu Naidu (@ncbn) February 28, 2024
చంద్రబాబు ట్వీట్ చేసిన కొంత సేపటికి భువనేశ్వరి కూడా స్పందించారు. కాఫీ అద్భుతంగా ఉందన్నారు. మన కిచెన్ లో ఉన్నప్పటికీ అరకు ప్రకృతి మధ్య అరకు కాఫీ తాగితే కలిగే అనుభూతి వేరుగా ఉంటుందన్నారు. ఇక్కడి గిరిజనుల ఆత్మీయత అరకు కాఫీకి ప్రత్యేకమైన రుచి వస్తుందేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు .అదే సమయంలో అరకు కాఫీని ప్రమోట్ చేసిన చంద్రబాబు కృషిని కూడా భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు.
Absolutely loved it andi! Although we have packets of it in our kitchen, it just tasted so much better amidst the scenic beauty of Araku and the warmth of our people here. I think the secret to this special taste is the love with which our tribal sisters and brothers grow it —… https://t.co/J8WbOwrFac
— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 28, 2024
ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ మంచి పేరుంది. ఇక్కడ పోడు వ్యవసాయం అధికం. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. అందుకే మంచి రుచి, రంగు, వాసన వస్తుంటుంది. చాలా మంది రైతులు పంటను పండించి గింజలను కంపెనీలకు అమ్ముతుంటారు. అయితే కొంత మంది మాత్రం ఇంట్లోనే కాఫీపొడిని తయారుచేసి అమ్ముకుంటూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంత ఇది. ఇక్కడి చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు బ్రాండ్ కాఫీని అంతర్జాతీయంగా మార్కెట్ చేసే అవకాశాల్ని కల్పించారు. గిరిజనలకు మంచి ఉపాధి లభించడంతో పాటు..అరకు కాఫీకి ప్రపంచ ప్రసిద్ధమైన గుర్తింపు వచ్చింది. అమెరికాలో కూడా పలు చోట్ల స్టాల్స్ ఉన్నాయి. అరకు కాఫీని చంద్రబాబు ప్రమోట్ చేసిన విషయాన్ని నారా భువనేశ్వరి తన ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు.