Central Funds to AP: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రెవెన్యూ లోటు రూ.879 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్ర ఆర్థికశాఖ
Central Founds To Andhra Pradesh: రెవెన్యూ లోటుతో ఉన్న 14 రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ గ్రాంట్ విడుదల చేసింది. మూడో నెలవారీ విడత కింద సోమవారం రూ.7,183 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
Central govt releases rs 7183 crore for revenue deficit grant to 14 states: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు తీపి కబురు అందించింది. రెవెన్యూ లోటుతో ఉన్న 14 రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ గ్రాంట్ విడుదల చేసింది. మూడో నెలవారీ విడత కింద సోమవారం రూ.7,183 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్రం విడుదల చేసింది. వాస్తవానికి 15వ ఆర్థిక సంఘం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ 14 రాష్ట్రాలకు మొత్తం రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సిఫార్సు చేసింది. ఈ మొత్తాన్ని నెలవారీగా కేంద్రం ఆ 14 రాష్ట్రాలకు విడుదల చేస్తోంది.
ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన రెవెన్యూ గ్రాంట్ రూ.7,183 కోట్లు కాగా, ఈ మొత్తాన్ని 14 రాష్ట్రాలు ఏపీ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ కు అందించింది. సోమవారం విడుదల చేసిన జూన్ 2022 మూడో విడత గ్రాంట్‌తో కలిపి రాష్ట్రాలకు కేంద్రం 2022-23లో విడుదల చేసిన మొత్తం రూ.21,550కు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2020-21 నుంచి 2025-26 వరకు ఆయా రాష్ట్రాలకు ఎంత మేర చెల్లించాలో 15వ ఆర్థిక సంఘం గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించింది.
ఏపీకి గుడ్‌న్యూస్..
15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మొత్తం 12 విడతల్లో నిధులు విడుదల చేస్తుంది కేంద్రం. ఇందులో తొలి విడతగా రూ. 7,183.42 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా జూన్ 6న మూడో విడత కింద రూ.7,183 కోట్లను కేంద్రం విడుదల చేస్తూ ఏపీకి శుభవార్త అందించింది. ఈ మొత్తంలో ఏపీకి 879.08 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి ఈ నిధులతో భారీ ఊరట కలగనుంది. దీంతో ఏపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ అందించిన మొత్తం గ్రాంట్ రూ.2,637.24 కోట్లకు చేరింది.
ఆర్థిక శాఖ సోమవారం 14 రాష్ట్రాలకు 7,183.42 కోట్ల రూపాయల పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ లోటు (Post Devolution Revenue Deficit) గ్రాంట్ కు చెందిన 3వ నెలవారీ వాయిదాను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.