Buddha Venkanna: నీ ఏజ్ ఏంటి? నువ్వు చేసే గలీజ్ పనులు ఏంటి? - మంత్రి అంబటికి బుద్ధా వెంకన్న ఘాటు లేఖ
Buddha Venkanna: మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఘాటు లేఖ రాశారు. మంత్రి అంబటిని మురికి నోటి పారుదల శాఖ మంత్రి అంటూ విమర్శించారు.
Buddha Venkanna: మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఘాటు లేఖ రాశారు. స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాయడానికి కౌంటర్ ఇస్తూ మంత్రి అంబటి రాంబాబు మరో లేఖ రాశారు. దీనికి కౌంటర్ ఇస్తూ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి అంబటిని మురికి నోటి పారుదల శాఖ మంత్రి అంటూ విమర్శించారు. నిత్యం మీరు పత్తేపారాలు నడిపే వారికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు?
అరగంటలో ఏమేమి చేస్తారంటూ లేఖాస్త్రం ఎందుకు వదలలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు? పిచ్చి జగన్ బ్రాండ్ పచ్చి మందు కాకుండా దుబాయ్‌లో మద్యం ఎందుకు కొన్నారంటూ ప్రశ్నించారు. దుబాయ్‌కు ఏ కన్యతో వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే టెక్నికల్ డీటెయిల్స్‌లోకి వెళ్లకుండా మీకు ప్రేమతో ప్రతి లేఖ రాస్తున్నానని, అది చదవి బదులివ్వాలని డిమాండ్ చేశారు.
‘నీ గలీజు చేతులతో లేఖలు రాయడం ఏంటి? ఓహో నువ్వు దుబాయ్‌లో ఉంటే, ఐప్యాక్ పేటీఎం బ్యాచులు ఈ లేఖ రాసేశాయా? అయ్యో రాంబాబు. నీ దుస్థితికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్పా ఏం చేయలేను’ అంటూ లేఖ రాశాలు. అంబటి లెటర్ రాసి రాంగ్ అడ్రస్‌కి పోస్టు చేశారని, మీరు రాయాల్సిన లేఖలు వీరికే అంటూ వ్యాఖ్యానించారు.
అంబటికి బుద్దా వెంకన్న ఏమని రాశారంటే..
‘అయ్యా అంబటి.. నువ్వు లెటర్ రాసి రాంగ్ అడ్రస్‌కి పోస్టు చేశావు. నువ్వు రాయాల్సిన లేఖలు వీరికి..
1. కృష్ణా జలాలు హక్కులు వదులుకున్న జగన్‌కు, రాష్ట్ర హక్కుల కోసం కేంద్రానికి లేఖ రాయాలి.
2. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు ఆమోదించమని కేంద్ర జలవనరుల శాఖా మంత్రికి రాయాలి.
3. ఇరిగేషన్ మంత్రిగా పిల్ల కాలువ తవ్వలేని నువ్వు, సాగునీరు ఇవ్వలేని నువ్వు రైతన్నలకు క్షమాపణ చెపుతూ లేఖ రాయాలి.
4. కాపు జాతిపై నోటి దూలతో నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు కాపులకి క్షమించమని కోరుతూ ఉత్తరం రాయాలి.
5. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ది పని చేయలేకపోయినందుకు గెలిపించిన ప్రజలకు సారీ చెపుతూ లేఖ రాయాలి.
6. పారిశుధ్య కార్మికుడు చనిపోతే వచ్చిన సీఎం సహాయ నిధిలో వాటా అడిగి, వారు ఇవ్వకపోవడంతో చెక్కు వెనక్కి తీసుకున్నందుకు సిగ్గుపడుతూ మన్నించమని వేడుకుంటూ లేఖ రాయాలి.
7. నీటిపారుదలశాఖా మంత్రిగా ఉంటూ లస్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేని నీ చేతగానితనాన్ని ఒప్పుకుంటూ ఉత్తరం రాయాలి.
8. పిచ్చి మందు తాగలేక దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని.. నీ పిచ్చి జగన్ కి లేఖ రాయాలి అంబటి!
9. బాబాయ్‌కి గొడ్డలిపోటు వేసిన అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నీ పిచ్చి జగన్‌ని తప్పు ఒప్పుకోమంటూ లేఖ రాయాలి.
మై డియర్ కాంబాబూ! నీ ఏజేంటి? నీ గేజేంటి? నువ్వు చేసే గలీజు పనులేంటి? ఆ గలీజు చేతులతో లేఖలు రాయడం ఏంటి? ఓహో నువ్వు దుబాయ్‌లో ఉంటే, ఐప్యాక్ పేటీఎం బ్యాచులు ఈ లేఖ రాసేశాయా? అయ్యో రాంబాబు.. నీ దుస్థితికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్పా ఏం చేయలేను. నేను రాసిన లేఖ చదువుకుని సమాధానం పంపుతావని ఆశిస్తూ... ఇట్లు, నీ ప్రియ మిత్రుడు, బుద్ధా వెంకన్న’ అంటూ లేఖ రాశారు.