By: ABP Desam | Updated at : 19 Jan 2023 03:31 PM (IST)
గంటాపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Ganta Vs Ayyanna : గంటా శ్రీనివాసరావుపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సీరియస్ కామెంట్స్ చేసారు. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? అంటూ ప్రశ్నించారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలన్నారు.. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు.. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని సెటైర్ వేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నామన్న ఆయన.. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు.. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటామన్నారు.
టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని అయ్యన్నపాత్రడు వ్యాఖ్యానించారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది.. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారన్న ఆయన.. సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయని ఎద్దేవా చేశారు.. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు.. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం ఉంటుంది.. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతామని ప్రకటించారు. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా..? అని ఎద్దేవా చేశారు.
బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారని ఫైర్ అయ్యారు.. దావోస్ సదస్సుకు అందరికీ ఒకే ఆహ్వానిస్తారని మంత్రి అమర్నాథ్‌కు తెలీదా..? అని ప్రశ్నించారు.. పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అమర్నాథ్ అంటూ హితవుపలికారు.. మాలాంటి వారిని తిట్టడానికే అమర్నాథ్‌కు మంత్రి పదవి ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు అయ్యన్నపాత్రుడు.అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దీనికి కారణంగా గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీలో యాక్టివ్ అవుతున్నారు. చాలా సార్లు ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగినా చివరికి ఆయన టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో బుధవారం పాల్గొన్న గంటా రెండేళ్లు కోవిడ్, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ పాదయాత్ర సంచలనం సృష్టించడం ఖాయమని అన్నారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర సస్సెషనల్ హిట్ అవుతుందన్నారు. ఈ క్రమంలో అయ్యన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అయ్యన్న వ్యాఖ్యలపై గంటా శ్రీనివాస్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
వైసీపీపై కోటంరెడ్డి ఎఫెక్ట్- బహిరంగంగానే మద్దతు తెలిపిన నెల్లూరు మేయర్
బావా కాకాణీ! ముందు నీ కేసు సంగతి చూడు! సజ్జలా వీడియో కాల్స్ వస్తాయి: కోటం రెడ్డి హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో టాప్ హెడ్లైన్స్ ఇవే!
నెల్లూరు పోలీసులకు షాకిచ్చిన దొంగ- వాగులోకి దూకి పరారీ
నెల్లూరు రోడ్లపై ఈడ్చికెళ్తా- కోటం రెడ్డికి ఫోన్లో వార్నింగ్- విన్నోళ్లకు బూతులు బోనస్!
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Adani Group - RSS: ఏడేళ్ల క్రితమే అదానీపై కుట్ర, ఇప్పుడు అమలు - స్టోరీలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!