News
News
X

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సీఎం జగన్ ను కలిశారు. రూ. పది లక్షల సాయాన్ని ఆమెకు సీఎం ప్రకటించారు.

FOLLOW US: 
Share:

AP News :   ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.మహిళల సాధికారత కోసం ఆశా మాలవ్య దేశ వ్యాప్తంగా సైకిల్ పై యాత్ర చేస్తున్నారు..  ఆశా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు.  రూ. 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని ఆశా మాలవ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు. 

అభినందించిన గవర్నర్ 
 
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చ ఆమె పలువురు ప్రముఖులను కలిసి,తన లక్ష్యాన్ని గురించి వివరించారు.ఇందులో భాగంగానే ఆమె తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిశారు.ఆశా మాలవ్య కృషిని ప్రశంసించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి సత్కరించారు.  ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆశా మాలవ్య గవర్నర్ భిశ్వభూషణ్ హరి చందన్ ను కూడా కలిశారు.తన యాత్ర కు సంబందించిన వివరాలను,ఫోటోలను గవర్నర్ కు చూపించారు.గతంలో పర్వతారోహకురాలిగా తన విజయాలను గురించి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు ఆమె వివరించారు.గవర్నర్ ఆశఆ మాలవ్యను సత్కరించి అభినందించారు.

పర్వత అధిరోహరణలో రికార్డు హోల్డర్ ! 

ఆశా మాలవ్య, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా కు చెందిన మహిళ. స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ ..మౌంటైనియరింగ్‌లో ఆశా మాలవ్య రికార్డు హోల్డర్‌ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆశా మాలవ్య 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేపట్టారు.2022 నవంబర్‌ 1న భోపాల్‌లో  ఆశా మాలవ్య సైకిల్ యాత్ర ప్రారంభించి విజయవాడ చేరుకున్నారు. మొత్తం 28రాష్ట్రాల్లో ఆమెతన సైకిల్ యాత్ర నిర్వహించాలనే  టార్గెట్ తో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే 7రాష్ట్రాల్లో ఆశా మాలవ్య సైకిల్‌ యాత్ర పూర్తయింది. భారత దేశంలో మహిళలకు రక్షణ లేదని,మన దేశం మహిళలకు   సురక్షితమైంది కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉందని ఆమె తెలిపారు. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని తాను ప్రపంచానికి  చాటి చెప్పాలనుకుంటున్నాని అందుకేనే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కి తన సైకిల్ యాత్ర ద్వార ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 

సీఎం జగన్ ను కలవడంపై సంతోషం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ని కలవటం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉందని చెప్పారు. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి  జగన్   అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని ఆమె కొనియాడారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్‌ ప్రవేశపెట్టటం, మంచి పరిణామమని చెప్పారు.తాను కూడ దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని,పూర్తిగా పరిశీలించానని వెల్లడించారు.దిశ యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోందని ఆశా మాలవ్య కితాబిచ్చారు. ఏపీలో మహిళలు మాత్రమే కాదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వివరించారు. తాను తలపెట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ,భరోసా ఇస్తూ ముఖ్యమంత్రిర జగన్  10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించానని,అక్కడ నుండి  ప్రత్యేక రక్షణ కల్పించిన ప్రభుత్వానికి ఆశా మాలవ్య ధన్యవాదాలు తెలిపారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచిని ఆశా మాలవ్య కితాబిచ్చారు.జగన్‌మోహన్‌రెడ్డిలాంటి మఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

 

 

Published at : 06 Feb 2023 04:36 PM (IST) Tags: AP Politics indian women ap updates ASA MALAVYA

సంబంధిత కథనాలు

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు! 

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

విధేయ‌త‌+స‌మ‌ర్థ‌త‌= పంచుమ‌ర్తి అనూరాధ, స్ఫూర్తిదాయ‌క ప్ర‌స్థానం

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు