Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి - వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్
Telangana IASSmita Sabharwal | ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని వికలాంగుల సహకార సంస్థ APVCC Ex చైర్మన్ కోటేశ్వర రావు డిమాండ్ చేశారు.
IAS officer after disability quota post | అమరావతి: దివ్యాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం శిక్షించాలని ఉమ్మడి AP వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ గొనుగుంట్ల కొటేశ్వర్ రావు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్మితా సబర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్
వికలాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను అనర్హురాలిగా ప్రకటించాలని, తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని NPRD ప్రతినిధి బృందం 2016 RPWD కమిషనర్ బి శైలజకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ సభ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21వ తేదీన ట్విట్టర్ X లో పోస్ట్ పెట్టారని ఆయన తెలిపారు. సీనియర్ ఐఏఎస్ దివ్యాంగులపై చేసిన పోస్ట్ సైబర్ నేరాల చట్టం, ఉద్యోగుల సర్వేసు నియమావళి ప్రకారం చట్ట వ్యతిరేకం అని కోటేశ్వర రావు తెలిపారు.
వికలాంగుల పట్ల చిన్న చూపు
దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్ హోదాల్లో దివ్యాంగులు శారీరకంగా సరిగ్గా పని చేయగలరా అని దేశ స్థాయి వికలాంగుల మనోభావాలు దెబ్బతినేలా, మానసిక ధైర్యం కోల్పోయేలా వికలాంగుల పట్ల చిన్న చూపు, వచ్చేలా స్మితా సబర్వాల్ ట్వీట్ చేయడం అన్యాయం అన్నారు. దివ్యంగులు IAS హోదాల్లో దేశంలోనే గొప్ప చరిత్ర సృష్టించిన వీరా సింఘాలును చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు చెప్పారు. దివ్యాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ పోస్టులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేక చర్యలని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
దివ్యాంగుల రిజర్వేషన్లు స్మితా సబర్వాల్ ఇవ్వలేదు
దివ్యాంగుల రిజర్వేషన్లు సుప్రీం కోర్టు, పార్లమెంటు సమర్థించినవి, కానీ స్మితా సబర్వాల్ ఇచ్చినవి కాదు అని కోటేశ్వర రావు చెప్పారు. ఎందరో ప్రపంచ చరిత్ర కలిగిన వికలాంగుల ముందు సబర్వాల్ ఎంత అని ఆమెని నిలదీశారు. స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై, స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. ఆమెపై చట్టపర చర్యలకు అదేశంచాలని కోరతామని వికలాంగుల సహకార సంస్థ APVCC Ex చైర్మన్ కోటేశ్వర రావు వివరించారు.
బాలలత వర్సెస్ స్మితా సబర్వాల్
ఐఏఎస్ స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన కామెంట్లపై మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాల లత కౌంటర్ ఇచ్చారు. ఇది ఆమె వ్యక్తిగతమా.? లేక ప్రభుత్వ విధానమా.? అని స్మితా సబర్వాల్ ను బాల లత ప్రశ్నించారు. దివ్యాంగులను ఆందోళనకు గురి చేసేలా స్మితా సబర్వాల్ కామెంట్లు చేశారని, సీనియర్ ఐఏఎస్ అయి ఉంది ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తుల గురించి ట్వీట్ చేయడం విచారకరం అని పేర్కొన్నారు. తనతో పోటీ పడి సివిల్స్ ఎగ్జామ్ రాయాలని బాలలత సవాల్ సైతం విసిరారు.