అన్వేషించండి

APSRTC Chairman On PRC: ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదు.. సమ్మెకు వెళ్లవద్దన్న ఏపీ ఆర్టీసీ ఛైర్మన్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదన్నారు రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి అన్నారు.

ఉద్యోగులకు  ఎప్పుడూ చేయనంత మేలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుండగా.. చరిత్రలో ఎన్నడూ ఇలా పీఆర్సీతో జీతాలు తగ్గలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదని వారు ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదన్నారు రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి అన్నారు. నేడు ఏపీలో జరుగుతున్న ఛలో విజయవాడ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెతు వెళ్తామని చెప్పారు, అయితే తమ పీఆర్సీ, ఇతర శాఖల ఉద్యోగుల పీఆర్సీకి సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్టీసీ సమస్యలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

తమ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. రెండేళ్ల క్రితం వరకు ఆర్టీసీకి  6 వేల కోట్ల పైగా అప్పులుండేవని గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకున్న అప్పుల్లో  1495 కోట్లు చెల్లించామని మల్లికార్జున రెడ్డి చెప్పారు. రాష్ట్ర ఆర్టీసీకి ఇంకా 4800 కోట్లుపైగా  అప్పులున్నాయని.. రెండేళ్లలో ఆర్టీసీకి ఉన్న అప్పులన్నింటినీ తీర్చాలని సీఎం సూచించారని చెప్పారు. తమకు కష్ట కాలంలో అండగా ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం మద్దతుగా నిలవాలని సూచించారు. కానీ కరోనా వల్ల ఆశించిన స్థాయిలో అప్పులు తీర్చలేకపోయాం అని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వల్ల వచ్చిన సమస్యలను ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది, కనుక ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లవద్దని, సమ్మెపై ఉద్యోగులు పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగిందని.. కనుక ఆర్టీసీని ఉద్యోగులే  రక్షించుకోవాలన్నారు. వేతనాల కోసం నెలకు 250 కోట్లు చొప్పున 25 నెలల్లో 6250 కోట్లు సీఎం జగన్ ఇచ్చారు. కనుక ఉద్యోగులు కష్టపడి పనిచేసి సంస్థను నిలబెట్టుకోవాలని, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా బస్సులు తిప్పడంపై ఎండీతో చర్చించి  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

Also Read: TDP Support Employees : ఉద్యోగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు .. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ !

Also Read: AP Employees : ఆంధ్ర ఉద్యోగుల్లో ఇంత ఆవేశం ఎందుకు ? జీతాలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదన అబద్దమేనా ?

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
Konaseema ONGC Gas Leak: కోనసీమలో భారీగా ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ.. ప్రజల తరలింపునకు సీఎం చంద్రబాబు ఆదేశం
కోనసీమలో భారీగా ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ.. ప్రజల తరలింపునకు సీఎం చంద్రబాబు ఆదేశం
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
CM Chandrababu: ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Embed widget