అన్వేషించండి

AP Governament On Pavan : ఆ జీవో వల్ల మత్స్యకారులకు లాభం - దుష్ప్రచారం చేస్తున్నారన్న ప్రభుత్వం !

జీవో నెంబర్ 217పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 హెక్టార్లకన్నా పెద్ద చెరువులకే ఆ జీవో వర్తిస్తుందన్నారు.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్సాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభ నిర్వహించి జీవో నెం. 217 చించి వేసిన అంశం సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.  జీవో 217పై దుష్ప్రచారం చేస్తున్నారని మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. జీవో 217 మత్స్యకారు హక్కులకు ఎలాంటి  భంగం కలిగించబోదని స్పష్టం చేశారు. ఆ జీవో కేవలం  100 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు మాత్రమే వర్తిస్తుందని చిన్న చెరువులకు వర్తించదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఉందని.. వీటిలో న్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్నవి కేవలం 582 చెరువులేనన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వాటికే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్

నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ జీవో అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.  నెల్లూరులో విజయవంతమైతే మిగతా చోట్లకు విస్తరించాలని నిర్ణయించామని మత్స్యశాఖ కమిషనర్ తెలిపారు. ఈ జీవో వల్ల మత్స్యకార సంఘాలకు మరింత ఆదాయం పెరుగుతుందన్నారు.  దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీవో నెంబర్ 217 ప్రకారం ఇప్పటి వరకూ మత్స్యకార సొసైటీలకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించేవారు.  కానీ ఈ జీవో ద్వారా బహిరంగ వేలానికి వెళ్లాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి   27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లారు.   తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయి. వందల  ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో లేకుండా జీవో ద్వారా తొలగించారు వాటిపై వస్తున్న ఆదాయం దళారుల పాలవుతోందని అందుకే ఈ నిరణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.  

పులివెందుల నుంచి కడపకు మార్పు - ఇక వివేకా కేసు తేలేది అక్కడే !

మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం  అనేక పనులు చేపట్టామని చెబుతోంది. 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించామని ని కన్నబాబు చెప్పారు. రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని.. ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. ప్రస్తుతం 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయని.. మిగతా 5 ఫిషింగ్ హార్బర్లూ టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మత్స్య ఎగుమతులను దేశీయంగా మరింత పెంచేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రీటైల్ అవుట్‌లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని.. రోడ్డు పక్కన అమ్ముకునే వారికి సౌలభ్యం కలిగించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. జీవో 217 వల్ల మత్స్యకారులకు లాభమే తప్ప నష్టం లేదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Breaking News: నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget