Breaking News Live Telugu Updates: గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 12 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల క్రితం (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఎల్లో అలర్ట్ ఈ 14 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఇక ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 34.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే 13.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేసింది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం
గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన ప్రమాదం
రోడ్డు మధ్యలో ఊడిపోయిన రాజసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్
కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో తప్పిన ప్రమాదం
అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన
బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మెర పెట్టుకుంటోన్న రాజసింగ్
తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజసింగ్ ఆవేదన
తన వాహనాన్ని వెనక్కి తీసుకోవాలంటోన్న రాజసింగ్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. రైతులకు 24 గంటలు త్రీ ఫేస్ కరెంటు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలపై చర్చించాలని సభలో వారు డిమాండ్ చేశారు. వారికి 5 గంటలు కరెంటు కూడా ఇవ్వడం లేదని అన్నారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.
Janagama Murder: తల్లి తల నరికిన కుమారుడు
జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆస్తి కోసం ఒక కొడుకు కన్నతల్లి తల నరికి హత్య చేశాడు. గ్రామానికి చెందిన కూరకాల రమణమ్మ (60) కన్న కొడుకు కూరకాల కన్నప్ప ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో కత్తితో తల నరికి మొండెం వేరు చేశాడు. హత్యానంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు.
Tirumala News: శ్రీవారి సేవలో ఇస్రో బృందం
తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఇస్రో డైరెక్టర్ ఏకే.పాత్రా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆర్.వై.యశోదాలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా స్వామి వారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకేట్ ప్రయోగం నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Kakinanda Accident: అంబటి ఆయిల్ కంపెనీలో ప్రమాదం, ఊపిరాడక ఏడుగురు దుర్మరణం
కాకినాడలో ఘోర ప్రమాదం జరిగింది. అంబటి ఆయిల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఏకంగా ఏడుగురు చనిపోయారు. కాకినాడలోని జి.రాగంపేటలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిలో కొంతమంది పాడేరు వాసులు ఉన్నట్లు గుర్తించారు.