News
News
X

Breaking News Live Telugu Updates: వివేకా హత్య కేసులో మరో సంచలనం - ఉమశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
కాణిపాకంలో ఉదయాస్తమాన సేవ ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి

చిత్తూరు :  ఉదయాస్తమాన సేవను నేటి నుండి ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి..

కాణిపాకం ఆలయంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈరోజు నుంచి కాణిపాకంలో ఉదయాస్తమాన సేవ కార్యక్రమాన్ని విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించారు.. ఈ సేవా టికెట్ ధర లక్ష రూపాయలుగా ఆలయ అధికారులు, పాలక మండలి నిర్ణయించింది.. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఉన్న స్వరూపా నందేంద్ర సరస్వతి స్వత్మ నరేంద్ర సరస్వతి వారిని దర్శించుకోవడానికి వచ్చిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి ,జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు ,చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కొంతమంది ప్రముఖులు స్వామివారి మర్యాదపూర్వకంగా కలసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.. కాణిపాకం ఆలయానికి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసును కూడా ప్రారంభించి, తర్వాత వినాయక స్వామి వారి మూలవిరాట్ను దర్శించుకొని, యాగశాలలో జరుగుతున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేసీఆర్ ది తుగ్లక్ పాలన ! ఈ ప్రభుత్వానికి సోయి, జ్ఞానం ఉందా ?: ఈటల రాజేందర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, కేవలం కొద్ది మంది (MIM) మెప్పు కోసం ప్రజలను వేదిస్తే ఊరుకునేది లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అధికారం ఎల్లకాలం ఉండదు.. అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజల ఉసురు పోసుకున్న వారు ఎక్కువ కాలం ఉండరన్న ఆయన.. బొడుప్పల్ బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములు పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో బోడుప్పల్ బాధితులు ఇందిరాపార్క్ వద్ద చేస్తున్న  ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరై మద్దతు తెలిపారు. 

ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదు: ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఉద్యోగులను వేధించడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే సూర్యనారాయణ విమర్శించారు. చిన్నపాటి సాకులను చూపి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. గతంలో ఎన్నడో జరిగిన చిన్నపాటి తప్పులను వెలికి తీసి చర్యలు తీసుకునే పేరిట అమాయక ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వివేకా హత్య కేసులో మరో సంచలనం - ఉమశంకర్ రెడ్డి భార్య స్వాతికి బెదిరింపులు

కడప జిల్లా... మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు....

ఈ హత్య కేసులో  మరో సంచలనం.....

ఈ కేసులో A3 గా ఉన్నటువంటి ఉమశంకర్ రెడ్డి భార్య స్వాతి కి బెదిరింపులు......

పులివెందుల లోని స్థానిక పాత బస్టాండు సమీపం లో  పాల వ్యాపారం చేస్తున్న ఉమ శంకర్ భార్య స్వాతి ని తన ఇంటి వద్ద శనివారం మధ్యాహ్నం సమయం లో సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన పరమేశ్వర రెడ్డి అతని కొడుకు కొందరు వ్యక్తులు తన ఇంటి వద్ద కు వచ్చి తనను కొట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని, నీ భర్త వైయస్ వివేకాను ఎలా చంపాడో అలాగే నీ భర్తను కూడా చంపుతామని బెదిరించారని, పరమేశ్వర్ రెడ్డి తన మీదకు చెప్పుతో దాడికి యత్నించాడని, భాదిరాలు పొలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది......

ఈ రోజు పులివెందుల ఏరియా ఆసుపత్రిలో  చెరి చికిత్స పొందుతున్న స్వాతి.....

Warangal News: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్‌ పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌లో రైటర్‌గా పని చేస్తున్న మౌనిక వరంగల్‌ లోని తన నివాసంలో రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

 

BRS MLA Sayanna: సాయన్న విగ్రహం ఆవిష్కరణ

దివంగత ఎమ్మెల్యే సాయన్న జయంతి పురస్కరించుకొని రసూల్ పూర లోని సిల్వర్ కాంపౌండ్ లో సాయన్న విగ్రహం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సాయన్న కుమార్తెలు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు రాకపోవడం గమనార్హం. దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సాయన్న సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆయన తో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సాయన్న కూతురు నివేదిత మాట్లాడుతూ ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి తన తండ్రి కంటోన్మెంట్ కు ఎన్నో సేవలు అందించాలని అది గుర్తుంచుకొని ఆయన మీద అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్కరికి తమ రుణపడి  ఉంటామని అన్నారు. తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తామని వారన్నారు.

Peddapuram News: బైక్ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
  • పెద్దాపురం మండలం దివిలి సమీపంలో పల్సర్ బైక్ మీద నుంచి జారిపడి ఇద్దరు దుర్మరణం
  • సతీష్ (22) దుర్గాప్రసాద్ (22) మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
  • స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
  • అతి వేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి
  • విచారణ చేపట్టిన పెద్దాపురం పోలీసులు
Chandrababu: హైదరాబాద్ నుంచి కాకినాడకు చంద్రబాబు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి వరుపుల రాజా భౌతికకాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడులోని అయన నివాసంలో నివాళులు అర్పిస్తారు. ఇందుకు గాను చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.00  గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్తిపాడు వెళ్లి వరుపుల రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తారు.

Background

వాతావరణ శాఖ మరో రెండు నెలల వేసవి సూచనను విడుదల చేసింది. ఆ ప్రకారం, ఈశాన్య, తూర్పు, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలకు గురయ్యే అవకాశం ఉంది. 

ఇక తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది. నిన్న మొన్నటి వరకూ కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ఉండేది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.1 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

 

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 

ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.

కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.