Breaking News Live Telugu Updates: దంతేవాడలో పేలిన మావోయిస్టులు మందుపాతర - 11 మంది పోలీసులు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి పశ్చిమ విధర్బలోని ఆవర్తనం నుండి మరత్వాడ మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
రాగల ఐదు రోజులకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (ఈ రోజు గాలి గంటకు 40 నుండి 50 కి మీ వేగంతో, రేపు ఎల్లుండి 30 నుండి 40 కిలోమీటర్ల వేగం)తో పాటు వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
తెలంగాణలో నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లా్ల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా తెలంగాణలోకి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతం నమోదైంది.
నిన్న ఇక్కడ భారీ వర్షాలు
తెలంగాణలో జనగామ, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ నిన్న సాయంత్రం భీకరమైన గాలులు వీచాయి. దాంతో పాటు భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి నేడు ఉదయం వరకూ తేలికపాటి వర్షం కురుస్తూనే ఉంది.
ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
‘‘గత మూడు రోజులుగా కోస్తాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. గాలుల సంగమంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రను అనుకూలించడం వలన వర్షాలు మనకు కోస్తాంధ్రలోనే బాగా పడుతున్నాయి. కానీ నేడు, రేపు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోకి తరలివెళ్లనుంది కాబట్టి నేడు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 50% అవకాశాలు మాత్రమే ఉంది. ఎందుకంటే గాలుల సంగమం అనంతపురానికి ఉత్తరాన అంత బలంగా లేదు. అలాగే మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. మిగిలిన కోస్తాంధ్రలో కూడ ఒకటి, రెండు చోట్లల్లో వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.
విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం
విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. పెందుర్తి పరిధిలో తిరుమల హాస్పిటల్ లో బాధితులు వినయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి వైద్యులు కిడ్నీ తీసుకున్నారు. చివరికి సీన్ రివర్స్ అయి పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లింది. కిడ్నీకి 8.50 లక్షలు ఇస్తామంటూ కామరాజు అనే వ్యక్తి, శ్రీను అనే మరొకరు వినయ్ కుమార్ కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారంగానే కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు బాధితుడు వినయ్ కుమార్.
కలెక్టర్ ఆఫీస్ సమీపంలో విజయ మెడికల్ లేబ్ లో వినయ్ కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తరువాత వినయ్ కు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులు కామరాజు, శ్రీనులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Vizag Beach: బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృత దేహం
- వైఏంసీఏ సమీపంలో బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృత దేహం
- పెద గంట్యాడ కు చెందిన శ్వేత గుర్తించిన పోలీసులు
- ఒడ్డుకు కొట్టుకు వచ్చిన యువతి మృతదేహం
- అత్యంత దారుణంగా మృత దేహం ఉండటంతో పోలీసులు అనుమానం
- నిన్న అర్ధరాత్రి వెలుగు లోకి వచ్చిన ఘటన, త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు
- మృతురాలు 5 నెలల గర్భవతి, కుటుంబ కలహాలతో చనిపోయినట్టు భావిస్తున్న పోలీసులు
MP Avinash Reddy Bail Petition: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
- రేపు వాదనలు వింటామన్న హైకోర్టు
- రేపు మధ్యాహ్నం తర్వాత ముందస్తు బెయిల్ పై కొనసాగనున్న వాదనలు
Warangal News: వరంగల్ లేడీస్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
వరంగల్ నిట్‌లో గల న్యూ లేడీస్ హాస్టల్‌లో బీ-10 రూంలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులంతా కళాశాలలో జరిగే ఈవెంట్‌కు వెళ్ళాక షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. యాజమాన్యం సమాచారం మేరకు హుటాహుటిన కళాశాలకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారుగా రూ. 4 లక్షల అస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Hussain Sagar News: నిన్నటి వర్షానికి హుస్సేన్ సాగర్ లో తప్పిన ప్రమాదం
నిన్న రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వానకి హుస్సేన్ సాగర్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. ఈదురుగాలుల ప్రభావం వల్ల సాగర్‌లో పర్యాటకులు ప్రయాణిస్తున్న భాగమతి బోటు అదుపుతప్పి పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బోటులో ఏకంగా 40 మందికి పైగా ఉన్నారు. మంగళవారం రాత్రి పర్యటకులతో బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లిన బోటు, ఈదురుగాలులతో అదుపు తప్పింది. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పీడ్ బోట్ల సాయంతో పర్యటక బోటులోని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో 40 మంది పర్యటకులు క్షేమంగా బయటికి వచ్చారు.