Breaking News Live Telugu Updates :కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
దక్షిణ ఝార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విస్తరించి ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆదివారం నాటికి ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ దిశగా కదులుతూ తీవ్రవాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కోస్తాంధ్ర, రాయలసీమలో
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలోని నేడు రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. శనివారం హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం కురిసింది.
హైదరాబాద్ లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం బలహీనపడుతోంది. దీంతో దాని ప్రభావం తెలంగాణపై ఉంది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఆగస్టు 21 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
Gold Price Today 21st August 2022: ఇటీవలే పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. ఇవాళ నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,150 వద్దే ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 అయింది. హైదరాబాద్‌లో రూ.700 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.61,300గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. వెండి కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. (Gold Rate Today In AP)
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 21st August 2022) 10 గ్రాముల ధర రూ.52,150 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.61,300 అయింది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఎవరూ ఊహించని విధంగా అమిత్ షా ఎన్టీఆర్ ను డిన్నర్ మీట్ కు రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు యంగ్ టైగర్ డిన్నర్ కోసం వెళ్లారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అందులో ఎన్టీఆర్ నటన చూసి ఫిదా అయ్యానని.. ఈ క్రమంలోనే ఆయనతో మాట్లాడని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేవలం సినిమా గురించే కాకుండా పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ అనంత బాబుకి మాతృమూర్తి వియోగం
ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి ఆనారోగ్యంతో మృతి చెందారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబుకి మాతృమూర్తి వియోగం.
గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అనంతబాబు తల్లి మంగారత్నం కొద్దిసేపటి క్రితం అపోలో హాస్పిటల్ లో మృతి చెందారు.





















