అన్వేషించండి

Payyavula Kesav: రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా?... మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారు... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు లేనట్లు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని పయ్యావుల కేశవ ఆరోపించారు. రైతుల కష్టాల గురించి మంత్రులు ఎందుకు చర్చించడంలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు సినిమా టిక్కెట్ల ధరల గురించే మంత్రులు చర్చిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతు సమస్యలు, తగ్గిన ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల కోసం మంత్రులు ఎప్పుడైనా చర్చించారా అని పయ్యావుల విమర్శించారు.

Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?

మంత్రులు మాట్లాడడం మర్చిపోయారు 

ఏపీ స‌చివాల‌యంలో సోమవారం పీఎసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి అధికారులు హాజ‌రు కాక‌పోవ‌టంపై పీఏసీ ఛైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ అభ్యంత‌రం తెలిపారు. సంబంధిత అధికారుల‌కు కోవిడ్ సోకితే మిగిలిన అధికారులు కూడా స‌మావేశానికి గైర్హాజరు అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో సినిమాలకు మించిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగిందని, కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారన్నారు. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పీఏసీ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. 

Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ

ఓటీఎస్ పేరుతో అక్రమంగా డబ్బు వసూలు

ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయబోతున్నారని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో అన్ని వర్గాలకూ అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. 

Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?

Also Read: కేజీహెచ్ పేరు మార్చడం కాదు చేతనైతే విశాఖ రైల్వే జోన్ సాధించండి.... బీజేపీ నేతలకు మంత్రి అవంతి స్ట్రాంగ్ కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget