News
News
X

PDS Rice: ఆత్మకూరు కేంద్రంగా రేషన్ బియ్యం దందా, 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యం సీజ్

పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

FOLLOW US: 
Share:

పేదల కోసం ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు రేషన్ బియ్యంతో కాసులు వెనకేసుకుంటున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పేదల నుంచి సేకరిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దళారులు రైస్ మిల్లులకు  విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి కాకినాడకు యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేయడం కామన్ అయిపోయిందని విమర్శలు ఉన్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నామమాత్రంగా ఒకటి, రెండు చోట్ల లారీలను, ఆటోలను సీజ్‌ చేస్తున్నప్పటికి అక్రమార్కులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.
కిలో రూ.15 నుంచి 20 రూపాయలు
తెల్ల కార్డు ఉన్న లబ్దిదారులందరూ రేషన్‌ బియ్యాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని అంటున్నారు. ఇందుకు కారణాలు అనేకం. దీంతో రేషన్ కార్డుదారుల వద్ద రేషన్‌ బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న దళారులు ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లర్లకు కిలో రూ.15 నుంచి 20 రూపాయలు చొప్పున తిరిగి విక్రయాలు చేస్తున్నారు. ఇలా సేకరించిన రైస్ ను అత్యంత రహస్యంగా దారి మళ్లిస్తున్నారు.
అధికారుల పాత్ర...
ఈ అక్రమ రవాణా వ్యవహరంలో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని చాలాసార్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈ వ్యవహరంలో రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందని విమర్శలు లేకపోలేదు. తాజాగా మంగళగిరిలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక  పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు  ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైస్ మిల్లుల యజమానులు దళారుల ద్వారా  తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయించి ఆపై  తమ మిల్లు పేరుతో ఉన్న లేబుల్‌ బస్తాల్లో నింపి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పైకి చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు లోపాయికారిగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఎన్నిసార్లు దాడులు చేసి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. 
ఆత్మకూరు కేంద్రంగా....
తాజాగా ఆత్మకూరు గుంటూరు ఛానల్ వద్ద గల శంకర్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. దీంతో మిల్లర్ల దందా ఎంత భారీగా జరుగుతుందో మరోసారి బహిర్గతం అయ్యింది.నిత్యం ఈ తంతు జరుగుతున్నా  సంబంధిత శాఖలకు మిల్లర్లు మామూళ్లు సమర్పించని సమయంలో విజిలెన్స్ అధికారులు చేత ఇలా దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తోన్న రైస్ మిల్లుల పై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు వ్యక్తం అవుతున్నాయి.

Published at : 19 Dec 2022 08:06 PM (IST) Tags: AP News Rice PDS Rice PDS Ration Rice AP Civil Supplies

సంబంధిత కథనాలు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌