By: ABP Desam | Updated at : 03 Apr 2022 07:34 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో కొత్త జిల్లాలు
AP New Districts : ఏపీ కొత్త జిల్లాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు పూర్తి చేసింది. తాజాగా అడిషనల్ ఎస్పీలు, ఆర్డీవోలను నియమించింది. 26 జిల్లాలకు 48 అడిషనల్ ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 47 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను సీఎం జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు.
తుది నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1) జిల్లా పేరు: శ్రీకాకుళం జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8 (ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16), పలాస డివిజన్ (కొత్తది)
మండలాలు: 30
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు
2) జిల్లా పేరు: విజయనగరం జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా బొబ్బిలి(11), విజయనగరం(15), కొత్తగా చీపురుపల్లి
మండలాలు: 27
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు
4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: పాడేరు(11), రంపచోడవరం(11)
మండలాలు: 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు
5) జిల్లా పేరు: విశాఖపట్నం జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు:కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(6)
మండలాలు: 11
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు
6) జిల్లా పేరు: అనకాపల్లి జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10), అనకాపల్లి(14)
మండలాలు: 24
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు
7) జిల్లా పేరు: కాకినాడ జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12), కాకినాడ(9)
మండలాలు: 21
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు
8) జిల్లా పేరు: కోనసీమ జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తగా కొత్తపేట
మండలాలు: 22
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు
9) జిల్లా పేరు: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(9)
మండలాలు: 19
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు
10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11)
మండలాలు: 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు
11) జిల్లా పేరు: ఏలూరు జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
మండలాలు: 28
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు
12) జిల్లా పేరు: కృష్ణా జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12), కొత్తగా ఉయ్యురు
మండలాలు: 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు
13) జిల్లా పేరు: ఎన్టీఆర్ జిల్లా జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
మండలాలు: 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు
14) జిల్లా పేరు: గుంటూరు జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8)
మండలాలు: 18
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు
15) జిల్లా పేరు: బాపట్ల జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
మండలాలు: 25
వైశాల్యం: 3,829 చ.కి.మీ
జనాభా: 15.87 లక్షలు
16) జిల్లా పేరు: పల్నాడు జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు: గురజాల (14), నరసరావుపేట(14), కొత్తగా సత్తెనపల్లి డివిజన్
మండలాలు: 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు
17) జిల్లా పేరు: ప్రకాశం జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు: 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
మండలాలు: 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు
18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు (కొత్తది)
మండలాలు: 38
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు
19) జిల్లా పేరు: కర్నూలు జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) కొత్తగా పత్తికొండ డివిజన్
మండలాలు: 26
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు
20) జిల్లా పేరు: నంద్యాల జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్ (8), కొత్తగా ఆత్మకూరు(10)
మండలాలు: 29
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు
21) జిల్లా పేరు: అనంతపురం జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్, తాడిపత్రి, గుంతకల్
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తగా గుంతకల్
మండలాలు: 31
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు
22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం (4) పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
మండలాలు: 32
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు
23) జిల్లా పేరు: వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు (12) బద్వేలు (12)
మండలాలు 36
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు
24) జిల్లా పేరు: అన్నమయ్య జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
మండలాలు: 30
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు
25) జిల్లా పేరు: చిత్తూరు జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు (15) కొత్తగా కుప్పం, కొత్తగా నగరి
మండలాలు: 31
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు
26) జిల్లా పేరు: తిరుపతి జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, కొత్తగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్.
మండలాలు: 34
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !
Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !
Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!