అన్వేషించండి

MP Raghu Rama: ఏపీ హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ... జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం... సుమోటోగా విచారణ చేయాలని వినతి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీజేకు ఎంపీ రఘురామ లేఖ రాశారు. జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచేలా జరుగుతున్న కుట్ర అని రఘురామ అన్నారు.

ఏపీ హైకోర్టు జడ్జిలను ఉద్దేశించి మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జస్టిస్ చంద్రు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని లేఖలో రఘురామ అన్నారు. ఏపీలో పరిస్థితులకు సంబంధించి కొద్ది రోజుల క్రింత జస్టిస్ చంద్రు ఓ ఇంగ్లీష్ పత్రికలోనూ ఆర్టికల్‌ రాశారని తెలిపారు. గతంలో వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ఆయనే జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారని రఘురామ లేఖలో అన్నారు.  న్యాయ వ్యవస్థపై దూషణలు చేసిన వారిలో ఆ ఎంపీ పేరు కూడా ఉందని తెలిపారు. అయినా ఆయనపై ఇప్పటివరకూ చర్యలు లేవని రఘురామ గుర్తుచేశారు. జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు కోర్టులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. దేశ న్యాయవ్యవస్థను కించపరిచేలా జరుగుతున్న కుట్రపై సుమోటోగా విచారణ ప్రారంభించాలని లేఖలో రఘురామ ఏపీ హైకోర్టు సీజేను కోరారు. 

Also Read: సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

జస్టిస్ చంద్రు ఏమన్నారంటే...?

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థనూ దూషించిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై జస్టిస్ చంద్రు తప్పుబట్టారు. ఏపీలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోందని, ఆ యుద్ధం శత్రువులు, రాజకీయ ప్రత్యర్ధులతో కాదు న్యాయ వ్యవస్థతో చేస్తోందని విమర్శించారు. అమరావతి భూముల విషయంలో ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని ఇప్పుడు కోర్టులు న్యాయం చేయాల్సింది పోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో జడ్జిల విమర్శలు చేస్తే ఈ వ్యవహారాన్ని  హైకోర్టు సుమోటోగా తీసుకుందని ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు. నలుగురిని అరెస్టు చేశారు మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. 

Also Read:  గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !

చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కొంత మంది మీడియా లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, లైట్స్ ఆఫ్ చేస్తామని ధర్మానసం మండిపడింది.  ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామన్న కోర్టు.. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని వ్యాఖ్యానించింది. ఒకటి, రెండు అంశాలను చూపించి మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించింది. ఒక డాక్టర్‌ని పోలీసులు రోడ్‌పై విచక్షణారహితంగా కొట్టారు హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్లాలని సూచించింది. దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే జడ్జి నుంచి కక్షిదారుల వరకు ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా అని జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు.

Also Read:  ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget