Lokesh On Balakrishna: బాల మామయ్యా.. సరిలేరు నీకెవ్వరయ్యా! బాలకృష్ణకు నారా లోకేష్ విషెస్
Balakrishna in TFI for 50 years | నటుడు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ తన మామయ్యకు విషెస్ తెలిపారు.
AP Minister Lokesh wishing Nandamuri Balakrishna | అమరావతి: యాభై ఏళ్లుగా వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు. ‘తాతమ్మకల’తో 1974వ సంవత్సరంలో తెరంగేట్రం చేసిన మామయ్య (Balakrishna) వేయని పాత్ర లేదు.. బాలకృష్ణ చేయని ప్రయోగం లేదు. ఐదు దశాబ్దాలలో హీరోగా 109 సినిమాలలో నటించి బాలకృష్ణ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాలతో గాడ్ ఆఫ్ మాసెస్ గా బాల మామయ్య బాలకృష్ణ పేరుగాంచారు. సాంఘిక, పౌరాణిక, వినోద ప్రధానమైన చిత్రాలలో హీరోగా నటించి అశేష అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. అగ్రహీరోగా వెలుగొందుతూనే.. రాజకీయాల్లో రాణిస్తూ..సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య బాలకృష్ణ’ అని ట్వీట్ చేశారు.
బాల మామయ్యా..సరిలేరు నీకెవ్వరయ్యా!
— Lokesh Nara (@naralokesh) August 30, 2024
ఏభై ఏళ్లుగా వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుతూ ఉన్న మా బాల మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘తాతమ్మకల’తో 1974వ సంవత్సరంలో తెరంగేట్రం చేసిన మామయ్య వేయని పాత్ర లేదు.. చేయని ప్రయోగం లేదు. ఐదు ద… pic.twitter.com/HxCFQO0ZJi
బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం ఆహ్వానం అందకపోతే ఎలా..? నిర్మాత క్లారిటీ
చిత్ర పరిశ్రమలోకి వచ్చి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన సినీ స్వర్ణోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే బాలయ్య సినీ స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రికల అందజేతపై టాలీవుడ్ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ స్పందించారు. హైదరాబాద్ నోవాటెల్‌లో సెప్టెంబరు 1వ తేదీన నందమూరి బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాం. ఇందుకు నటులతో పాటు అన్ని విభాగాల మద్దతు లభించిందని.. ఇతర సినీ పరిశ్రమల వారు సైతం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇన్విటేషన్స్ అందలేదంటూ కొందరి నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. అయితే అన్ని యూనియన్స్ ద్వారా ప్రతి ఒక్కరికీ పీడీఎఫ్ రూపంలో ఆహ్వానం అందించినట్లు స్పష్టం చేశారు. ఎవరికైనా ఫిజికల్‌గా ఆహ్వానం అందకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను తమ కుటుంబంలా భావించి, అందరూ ఈవెంట్‌కు రావాలని దామోదర ప్రసాద్ కోరారు. బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు హాజరుకాబోయే గెస్టుల వివరాలను శనివారం (ఆగస్టు 31న) వెల్లడిస్తామని చెప్పారు.