అన్వేషించండి

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం, మైసూరులో బాలాజీ గోవిందప్ప అరెస్ట్

Govindappa Balaji arrested in AP Liquor Scam | ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్ట్ చేశారు.

 అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. సిట్‌ అధికారులు బాలాజీ గోవిందప్పను కర్ణాటకలోని మైసూరులో అరెస్ట్‌ చేశారు. అనంతరం సిట్ అధికారులు మైసూరు నుంచి నిందితుడ్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన భారతీ సిమెంట్స్‌ ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

బాలాజీ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్‌ అధికారులు 3 రోజుల కిందట నోటీసులు ఇచ్చారు. వీరిని విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ ఆఫీసులో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. కానీ ఈ ముగ్గురూ సిట్ అధికారుల నోటీసులను పట్టించుకోలేదు. విచారణకు ఈ ముగ్గురు గైర్హాజరు అయ్యారు. మరోవైపు వీరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం వీరిని అరెస్టు చేయకుండా ఉండాలని ఊరట కలిగించడానికి నిరాకరించింది.

భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో పాటు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు. వైసీపీ హయాంలో మద్యం వ్యవహారం, డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించడంలో గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల పాత్ర ఉందని అభియోగాలున్నాయి. హైదరాబాద్, తాడేపల్లిలో లిక్కర్ కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో వీరు సమావేశమై ముడుపులపై చర్చించేవారని సిట్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. లిక్కర్ స్కాం మొత్తం ముడుపులను ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వీరికి ఇవ్వగా.. అటు నుంచి జగన్‌కు ఆ సొమ్ము చేరేదని నిందితుల రిమాండ్‌ రిపోర్టుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
Vijayawada Police: విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
విదేశీయుల ఆశ్రయంపై పోలీసుల నిఘా.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget