Amaravati Petitions: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ... 3 రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి... విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
ఏపీ హైకోర్టులో అమరావతి రాజధాని వ్యాజ్యాలపై రోజువారి విచారణ చేస్తుంది. ఈ విచారణలో 3 రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 3 రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోర్టును కోరారు. శుక్రవారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Also Read: త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !
పూర్తి వివరాలు సమర్పించండి
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు రాజధానుల చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ లో ఆమోదించారు. అమరావతి పిటిషన్ల రోజువారీ విచారణలో హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని తెలియజేశారు. 3 రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Also Read: మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఉపసంహరణ వరకూ ఎప్పుడు ఏం జరిగింది..?
వెనక్కి తగ్గేదేలే.. త్వరలో కొత్త బిల్లులు : సీఎం జగన్
మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్వరలోనే సమగ్రమైన బిల్లులతో మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెడతామని ప్రకటించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టింది. గతంలో ఉన్న సీఆర్డీఏను పునరుద్ధరించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా రద్దు చేస్తున్నట్లుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. భాగస్వాములతో సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం వంటి కారణాల వల్ల బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా బుగ్గన చెప్పారు.
Also Read: విధి నిర్వహణలో మరో ప్రాణం బలి.. శవమై తేలిన సచివాలయ ఉద్యోగి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి