బదిలీలు, పదోన్నతులపై నిషేధాన్ని జులై 12వ తేదీ వరకు సడలించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ నోడల్ అధికారులను నియమించారు.
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
AP Government Employees | రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ఏపీలోని 26 జిల్లాలు, 6 జోన్ల మధ్య ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ ఖరారుకు సీఎస్ జి.సాయిప్రసాద్ మార్గదర్శకాలు విడుదల చేశారు.

- బదిలీలపై నిషేధాన్ని జూలై 12 వరకు సడలించారు; నోడల్ అధికారులు.
Andhra Pradesh Zones: అమరావతి: ఏపీలో ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని పాత 26 జిల్లాలు, 6 జోన్ల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ల ఖరారు ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను ఎలా చేపట్టాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేశారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయించాలని ఆదేశించారు. విభాగాధిపతులు ఈ నివేదికలను సిద్ధం చేసి కార్యదర్శులకు పంపించగా, వారు ఆర్థిక శాఖ పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం సమర్పించనున్నారు.
రెండు మల్టీ జోన్లు... 6 జోన్లుగా వర్గీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 28 జిల్లాలు ఉన్నప్పటికీ, రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రస్తుతానికి 26 జిల్లాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్-1 పరిధిలోకి జోన్-1 (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి), జోన్-2 (అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ), జోన్-3 (పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్) వస్తాయి. అలాగే మల్టీ జోన్-2 పరిధిలోకి జోన్-4 (గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు), జోన్-5 (చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప), జోన్-6 (నంద్యాల, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి) జిల్లాలను చేర్చారు.
Also Read: ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓలు మల్టీ జోనల్ క్యాడర్లు
ప్రతి శాఖలోని పోస్టుల క్యాడర్ స్ట్రెంత్‌ను పాత పోస్టుల కేటాయింపు నిష్పత్తి ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల మధ్య 40:50:10 నిష్పత్తిలోనూ, కర్నూలు, నంద్యాల మధ్య 55:45 నిష్పత్తిలోనూ పోస్టులను పంచుతారు. డెప్యుటేషన్, లీవ్, సస్పెన్షన్‌లో ఉన్న పోస్టులను ఖాళీలుగా భావించరు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ వంటి కీలక రాష్ట్ర స్థాయి పోస్టులను ఇకపై మల్టీ జోనల్ క్యాడర్లుగా మార్చి 2 మల్టీ జోన్ల మధ్య విభజిస్తారు. ఈ మార్గదర్శకాలు పర్మినెంట్, తాత్కాలిక పోస్టులన్నింటికీ వర్తిస్తాయి. అయితే, ఆలిండియా సర్వీసెస్, జ్యుడిషియల్ అధికారులు, అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు సిబ్బందికి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఇవి వర్తించవు.
బదిలీలపై నిషేధం సడలింపు – నోడల్ అధికారుల నియామకం
ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు బదిలీలు, పదోన్నతులపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం జులై 12వ తేదీ వరకు సడలించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేయగా జులై 13వ తేదీ నుంచి తిరిగి నిషేధం అమల్లోకి రానుంది. మరోవైపు, ఈ స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, నిరంతర పర్యవేక్షణకు గానూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ నోడల్ అధికారులను నియమించారు. వీరు రిజర్వేషన్ రోస్టర్లు, సీనియారిటీ జాబితాలను ఖరారు చేయడంతో పాటు ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన ఇండెంట్లను సిద్ధం చేస్తారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Frequently Asked Questions
బదిలీలపై నిషేధం ఎప్పటి వరకు సడలించారు, ప్రక్రియ పర్యవేక్షణకు ఎవరు నియమితులయ్యారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















