అన్వేషించండి

Sawang Transfer : ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ - ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు !

ఏపీ డీజీపీ సవాంగ్ ను సీఎం జగన్ బదిలీ చేశారు. ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఆయననే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బదిలీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. గౌతం సవాంగ్ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గౌతం సవాంగ్‌కు ఇంకా సుదీర్ఘమైన సర్వీస్ ఉంది. వచ్చే ఏడాది జూలై వరకూ ఆయన సర్వీసులో ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడే పోలీసు బాస్‌గా పని చేసి ఉద్వాసనకు గురి కావడంతో  ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ ఇస్తుందనేది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Sawang Transfer : ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ - ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు !

మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...

గౌతం సవాంగ్ అన్న అంటూ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ఆప్యాయంగా పిలిచే డీజీపీని హఠాత్తుగా బదిలీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇటీవల ఆయనకు ఉత్తమ డీజీపీగా అవార్డు కూడా వచ్చింది. అలాగే దేశంలో అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నట్లుగా పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.  కానీ ఇటీవలి కాలంలో సవాంగ్ పని తీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల ఉద్యమం సందర్భంగా సీఎం జగన్ చెప్పిన ఆదేశాలను పోలీసులు పాటించలేదన్న అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరు వినిపించింది. ఏపీలోనే ఎందుకు పట్టుకోలేదన్న విమర్శలు వచ్చాయి. అలాగే పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలు కూడా సీఎం జగన్ కటువైన నిర్ణయం తీసుకోవడానికి కారణం అని అంచనా వేస్తున్నారు.
Sawang Transfer : ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ - ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు !

పోలీసులు, ఇంటలిజెన్స్ వైఫల్యంపై సీఎం జగన్ సీరియస్.. అరగంట పాటు వివరణ ఇచ్చిన డీజీపీ ?

ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డీజీపీగా సవాంగ్‌కు బాధ్యతలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాన్సిచ్చారు. అయితే ఇద్దరూ రిటైర్మెంట్ వరకూ తమప పదవుల్ని నిలుపుకోలేకపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా రిటైర్ అయ్యే వరకూ సీఎస్ పదవిలో ఉండనీయలేదు. మధ్యలోనే బదిలీ చేశారు. ఇప్పుడు డీజీపీ సవాంగ్‌కూ అదే పరిస్థితి. ప్రాధాన్యం లేని పోస్టుకు అప్పటి సీఎస్ ఎల్వీని బదిలీ చేశారు. ఇప్పుడు సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా డీజీపీగా చేసిన సవాంగ్ కొత్త పోస్టులో కుదురుకోవడం కష్టమని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Embed widget