అన్వేషించండి

AP Deputy CM Pawan Kalyan: హిమాలయాలు ఎలా తలవంచవో... ప్రధాని మోదీ ఎక్కడా తలవంచరు: పవన్ కల్యాణ్

‘పిఎం - జన్ మన్’ ద్వారా రూ.555 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎం., డిప్యూటీ సి.ఎం.ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు

న్యూఢిల్లీ: ‘హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో... భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎక్కడా తలవంచరు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత మన ప్రధానిదే’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సి.ఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నడూ ఓట్లు వస్తాయా రావా అనేది ఆలోచన చేయలేదు. దేశ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు.  ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ‘పి.ఎం – జన్ మన్’ కార్యక్రమం. కేంద్రం నిధులు సమకూరుస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTG) ఉండే ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పి.ఎం. - జన్ మన్ ద్వారా కేంద్రం అందిస్తున్న రూ.555.61 కోట్ల నిధులతో 612.72 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తున్నాం. ఇవన్నీ పర్టీక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలను అనుసంధానించే రహదారులు. వీటి ద్వారా ఏపీలో 7 జిల్లాల్లో 239 పి.వి.టి.జి. ఆవాసాలకు రహదారులు అందుబాటులోకి తెస్తున్నామని’ చెప్పారు.

ఓట్లు కోసం చూస్తే...
239 ఆవాసాలకు రహదారుల ఏర్పాటు చేయడంతో సుమారు 50 వేల మందికి రోడ్డు సౌకర్యం వస్తుందన్నారు. వారు మనకు ఓట్లు వేస్తారా లేదా అనే ఆలోచన ఎక్కడా చేయలేదు ప్రధాని నరేంద్ర మోదీ. అదే మొత్తాన్ని ఓట్లు వస్తాయి అనే చోట ఖర్చు చేయవచ్చు. ప్రతి ఒక్కరికీ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ముందడుగు వేస్తున్నారు. ఆ స్ఫూర్తితోతోనే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ (AP Cabinet) ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ 3 నెలలపాటు రాష్ట్రంలో పర్యటించి తయారుచేసిన నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఆపరేషన్ సిందూర్, అందుకు దారి తీసిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఇటువంటి దశలో సైతం ప్రజల రక్షణతోపాటు వారి భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ ఆలోచించారు. దేశంలో కుల గణన చేపట్టడం చాలా అవసరం. దేశంలో ఉన్న కులాల పరిస్థితులు, వారి జీవనం, వృత్తులు, స్థితిగతులు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాలు, వెనుకబడిన వర్గాల వారికి జీవనోపాధి మెరుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ పథకాలు తీసుకురావాలో పాలకులకు స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget